»   » మొన్న ప్రీతి, నిన్న కంగన, నేడు శ్రీదేవి..ఆడవారి గురించి ఆడవారే నీచంగా, సిగ్గుచేటు అంటున్న ఖుష్బూ!

మొన్న ప్రీతి, నిన్న కంగన, నేడు శ్రీదేవి..ఆడవారి గురించి ఆడవారే నీచంగా, సిగ్గుచేటు అంటున్న ఖుష్బూ!

Subscribe to Filmibeat Telugu
Kushbu's Reaction On Male Dominent Nature Of Soceity

సమాజంలో పురుషాధిక్య ప్రభావం ఎక్కువగా ఉంది. పాశ్చాత్త దేశాలలో కూడా పురుషాధిక్యం ఎక్కువగా కనిపిస్తుంది కానీ భారత ఉపఖండంలో ఉన్నత ఎక్కువగా ఈ ప్రభావము అక్కడ ఉండదు. మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య ఏం జరిగిన స్త్రీలని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రముఖులు మహిళా సంఘాలు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దిగ్గజ నటి శ్రీదేవి మృతితో ఈ అంశం మరో మరు తెరపైకి వచ్చింది.

మొదట బలయ్యేది హీరోయిన్లే

మొదట బలయ్యేది హీరోయిన్లే

చిత్ర పరిశ్రమలో ఏవైనా పుకార్లు పుడితే మొదటగా బలయ్యేది హీరోయిన్లే. చిత్ర పరిశ్రమలో పుకార్లన్నింటిని హీరోయిన్ సెంట్రిక్ గానే సృష్టిస్తారు. ఇదో రకమైన పైశాచిక ఆనందం అంటూ పలువురుప్రముఖులు మండి పడుతున్నారు.

వ్యాప్వార వేత్తతో ప్రీతి జింతా

వ్యాప్వార వేత్తతో ప్రీతి జింతా


వాడియా అనే వ్యాపారవేత్తతో ప్రీతి జింతా 2009 లో సహజీవనం ప్రారంభించింది. ప్రీతి సహజీవనం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతా ప్రీతి జింతా గురించే చర్చించుకున్నారు.

విడిపోయిన తరువాత

విడిపోయిన తరువాత

లైంగిక వేధింపుల వివాదంతో ఆ తరువాత వాడియా నుంచి ప్రీతి జింతా విడిపోయింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇన్ని రోజులు కలసి ఉండగా లేదని, ఇప్పుడు ఈ లైంగిక వేధింపులు ఏంటి అంటూ ప్రితిపై కామెంట్లు కూడా వినిపించాయి.

బాలీవుడ్ ని షేక్ చేసిన కంగనా వివాదం

బాలీవుడ్ ని షేక్ చేసిన కంగనా వివాదం

కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ఈ మెయిల్స్, ప్రేమ లేఖల వ్యవహారం కూడా బాలీవుడ్ లో పెను దుమారం రేపింది. కంగనా రనౌత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తోందటూ హృతిక్ రోషన్ అప్పట్లో మీడియా కుందుకు వచ్చాడు కూడా. ఏ వ్యవహారం కంగనా రనౌత్ ని బాగా డిస్ట్రబ్ చేసింది. మానసికంగా కంగానా కుంగిపోయింది.

ధైర్యంగా ముందుకు

ధైర్యంగా ముందుకు

కంగనా తరువాత కెరీర్ లో సెటిల్ అయ్యాక ఈ విషయం గురించి ధైర్యంగా మాట్లాడడం మనం విన్నాం. కంగనా విషయంలో జరిగింది, వేరెవరైనా మేల్ యాక్టర్ చేసి ఉంటె ఇంత సీన్ జరిగి ఉండేది కాదని కొందరి వాదన.

శ్రీదేవి మరణాన్ని కూడా

శ్రీదేవి మరణాన్ని కూడా

శ్రీదేవి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర వేదన అనుభవిస్తున్న తరుణంలో కొందరు ఈ విషయంలో కూడా శ్రీదేవిని దోషిగా చూపించే ప్రయత్నం చేసారు.

శ్రీదేవి బ్లడ్ లో ఆల్కహాల్

శ్రీదేవి బ్లడ్ లో ఆల్కహాల్

శ్రీదేవి మృతి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమె రక్తంలో ఆల్కహాల్ ఉందని వచ్చింది. దీనిని బూచిగా చూపి దిగ్గజ నటి స్థాయిని తగ్గించే ప్రయత్నం కొందరు చేసారని వాదన వినిపిస్తోంది. ఫీమేల్ యాక్టర్ రక్తంలో ఆల్కహాల్ ఉంది కాబట్టి ఇలా మాట్లాడారు. ఇదే ఒక మేల్ యాక్టర్ విషయంలో ఇది జరిగిఉంటే ఎవరైనా నోరు తెరిచేవారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆల్కహాల్ తీసుకున్నంత మాత్రాన

ఆల్కహాల్ తీసుకున్నంత మాత్రాన

ఆల్కహాల్ సేవించినంత మాత్రాన శ్రీదేవి లెజెండరీ నటి కాకుండా పోతుందా అని విమర్శకులకు ప్రముఖులు చురకలు అంటిస్తునారు.

మొన్న ప్రీతి, నిన్న కంగనా, నేడు శ్రీదేవి

మొన్న ప్రీతి, నిన్న కంగనా, నేడు శ్రీదేవి

ప్రీతి జింతా ఓ వ్యక్తితో విడిపోయిన సందర్భంలో ఆమె చుట్టూ విమర్శలు వినిపించాయి. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వ్యవహారంలో కూడా ఆమెని ఏకాకిని చేసారు. ఇప్పుడు శ్రీదేవి వంటి దిగ్గజ నటి మరణిస్తే ఆమె ఆల్కహాల్ సేవించిందని మాట్లాడుతున్నారు. ఇలాంటి పోకడలకు స్వస్తి చెప్పాలని ఖుష్బూ లాంటి నటులు కోరుకుంటున్నారు.

ఆడవారి గురించి ఆడవారే

ఆడవారి గురించి ఆడవారే

శ్రీదేవి వంటి నటి విషయంలో ఇలా మాట్లాడడం నిజంగా బాధాకరమని ఖుష్బూ అన్నారు. కేవలం మగవారు మాత్రమే కాదు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆడవారి గురించి ఆడవారే నీచంగా ఆలోచిస్తుంరని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇది సామజిక దిగజారుడుతనానికి సూచిక అని ఆమె అభిప్రాయం పడ్డారు.

English summary
Female centric controversies continuing in Bollywood. Even Sridevi death also became controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu