కాజల్ అభిమానుల తప్పుదారిపట్టిస్తోంది: ఎడిటర్ కబీర్ శర్మ
ఎఫ్ హెచ్ ఎం పత్రిక ముఖచిత్రంపై అర్థనగ్నంగా ఫోజిచ్చిన కాజల్ ఎంచేతనో ఆ ఫోటో తనది కాదని ఎదురు తిరిగింది. అసలు తాను అలా ఫోజివ్వలేదని, మార్ఫింగ్ చేసి చూపించారని చెప్పుకొచ్చింది. కాజల్ చెల్లెలు నిషా ఆమెకి వంత పాడుతూ తన అక్క ఎప్పటికీ అలాంటి ఫోజులివ్వదని డెక్కన్ క్రానికల్ ప్రతినిధికి చెప్పింది. ఈ మార్ఫింగ్ ఆరోపణలు ఎఫ్ హెచ్ఎం పత్రికాధిపతులకి చేరడంతో వాళ్లు స్పందిచారు.
సదరు పత్రిక ఎడిటర్ కబీర్ శర్మ మాట్లాడుతూ కాజల్ తమకోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ చేసిందని, ఇప్పుడెందుకని ఇలా మాట్లాడుతోందో తెలీడం లేదని, తాము మార్ఫింగ్ చేశామని చెప్పడం తమ బ్రాండ్ పరువు తీయడమే కాకుండా ఆమె అభిమానుల్లని తప్పుదారి పట్టించడమేనని అన్నారు. ఆమె ఫోటోషూట్ తాలూకు ఇతర ఫోటోలన్నీ యథాతథంగా బయట పెడతామని, ఈ ఫోటోషూట్ అభ్యంతరం లేదంటూ కాజల్ సైన్ చేసిన ఫారం కూడా చూపిస్తామని చెప్పారు. ఫోటో షూట్ చేసింది కాకుండా ఎదురు వారినే తప్పుబట్టడం ద్వారా కాజల్ ఈ వ్యవహారంలో చాలా నష్టపోయింది.


Click it and Unblock the Notifications











