For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవమానించందంటూ కాజల్ పై ఫైరింగ్..కేసు యోచన

  By Srikanya
  |

  రెండు రోజుల క్రితం ఎఫ్ హెచ్ ఎం ఆంగ్ల పత్రిక కవర్ పేజిపై కాజల్ అగర్వాల్ టాప్ లెస్ ఫోజ్ వచ్చి సంచలనం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. అయితే తాను అలా ఫోజ్ లు ఇవ్వలేదని,అదంతా మార్పింగ్ వ్యవహారమని కాజల్ తేల్చేసింది. కానీ ఆ విషయాన్ని ఎఫ్ హెచ్ ఎం పత్రిక వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తామకు అలా వేరొకరి ఫోటోలను మార్పింగ్ చేసి తమ కవర్ పేజి మీద వేసుకోవాల్సిన ఖర్మ పట్టేలంటూ వారు ఖండన ఇచ్చారు. ఈ విషయంపై ఎడిటర్ కబీర్ శర్మ మాట్లాడుతూ,,,గతంలో ఎప్పుడూ మా మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు. మేము కాజల్ మీద ఆగస్టు 18 న ఫోటో షూట్ చేసాం. ముంబైలో జరిగిన ఈ షూట్ కి ఆదారాలు మా వద్ద ఉన్నాయి. త్వరలోనే మేము ఆ ఫోటో కు చెందిన రా పిక్చర్స్ ని ఇంటర్ నెట్ లో పెడతాం. అలాగే ఆమె ఇలా ఫోజ్ ఇస్తానని ఒప్పకుని సైన్ చేసిన పేపర్లు మా వద్ద ఉన్నాయి. మార్పింగ్ చేసామంటూ ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. అంటే మా బ్రాండ్ ని వారు అవమానం చేసినట్లే.కాజల్ అలా ఫోటో షూట్ అయ్యాక మనస్సు ఎందుకు మార్చుకుందో మాకు తెలియదు..త్వరలోనే నిజా నిజాలు బయిటకు వస్తాయి అని తేల్చి చెప్పాడు.

  ఇక ఆమె సోదరి నిషా అగర్వాల్ మాట్లాడుతూ..ఆ ఫోటో వలన తన అక్క ఇమేజ్ చాలా పోయిందని,ఎందరో తమకు ఫోన్ లు చేస్తున్నారని,తమ కుటుంబం మొత్తం అప్ సెట్ అయ్యారని అంది. ఆ పత్రికమీద కేసులు వేసే ఆలోచనలో ఉన్నామని,అలాగే ఆ పోటో లు ఉన్న పుస్తకాలు మార్కెట్లోంచి తీయించేలా చర్యలు తీసుకునేందుకు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నామని ఆమె అంది.ఇక దక్షిణాదిన ఇలాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండడే కాజల్‌ ఇలా కనిపించేందుకు ఎందుకు ఒప్పుకొందో అని సినీ పరిశ్రమలోని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బాలీవుడ్‌ దర్శకుల దృష్టిలోపడేందుకే ఈ ఫోటోలు హంగామా అంటున్నారు. ఈ హాట్‌ చిత్రా లు కాజల్‌కి గ్యారెంటీగా హిందీలో అవకాశాలు తీసుకొస్తాయని భావిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అజయ్‌దేవగణ్‌ నటించిన 'సింగమ్‌'లో చేసిన కాజల్‌ కి ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అవసరమైతే గ్లామర్‌ ఒలికించడానికి తాను సిద్ధమని ఇలా సంకేతాలు పంపిస్తోందని చెప్పుకున్నారు.ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్ సరసన ది బిజినెస్ మ్యాన్ చిత్రంలో చేస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రారంభమైన ఆ చిత్రం పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది.

  English summary
  FHM has never in the past or will in the future morph pictures of any celebrities. We shot with madam Agarwal on the 18th of August in Mumbai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X