»   » పెళ్లి కాలేదు.. పిల్లలు లేరు.. తండ్రి పాత్ర అనగానే షాక్ తిన్నా.. ఉద్వేగానికి గురైన సాయిచంద్

పెళ్లి కాలేదు.. పిల్లలు లేరు.. తండ్రి పాత్ర అనగానే షాక్ తిన్నా.. ఉద్వేగానికి గురైన సాయిచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిదా చిత్రం అన్నివర్గాలను ఆకట్టుకొంటూ దూసుకెళ్తున్నది. ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా సీనియర్ నటుడు సాయిచంద్‌ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. గతంలో చిరంజీవితో మంచు పల్లకిలో ఓ హీరోగా, యువతరం కదిలింది, ఈ చరిత్ర ఏ సిరాతో లాంటి అభ్యుదయ చిత్రాల్లో ఆయన నటించారన్న సంగతి తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న సాయిచంద్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించి మ్యాజిక్ చేశాడు. తండ్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఓ భావన కల్పించారు సాయిచంద్. ఫిదా సంచలన విజయం సాధించిన తర్వాత సాయిచంద్ ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన స్పీచ్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

ఫాదర్ పాత్ర అనగానే కంగుతిన్నాను..

ఫాదర్ పాత్ర అనగానే కంగుతిన్నాను..

భగవంతుడు ఇవ్వదలుచుకుంటే బ్రహ్మండం బద్దలైనట్టు ఇచ్చేస్తాడు. దాదాపు నేను 25 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాను. సినిమాల్లో నటించలేదు. గతేడాది నా పుట్టిన రోజు జూన్ 25న సడన్‌గా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ రోజు ఫోన్ చేసి తాను రూపొందించబోయే చిత్రంలో మీరు నటిస్తారా అని అడిగారు. మంచి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది. ఫాదర్ పాత్ర అని చెప్పారు. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాల్సి ఉంటుంది అని చెప్పగానే నీరుగారిపోయాను అని సాయిచంద్ అన్నారు.

CM KCR appreciates Fidaa Movie Cast and Crew
కథ నచ్చితే నటించండి..

కథ నచ్చితే నటించండి..

మీ ఇంటికి వచ్చి కథ చెప్తాను. కథ నచ్చితే మీరు చేయండి. ప్రముఖ దర్శకుడ నా ఇంటికి వచ్చి చెప్తానని చెప్పగానే షాక్ తిన్నాను. దాంతో డైరెక్టర్ల మీద నాకు అమోఘమైన నమ్మకం ఉన్న వ్యక్తిని నేనే వస్తానని చెప్పాను. మరుసటి రోజు నేను వెళ్లగానే కథ చెప్పాడు. తండ్రి పాత్ర ఎవరికీ అని అడిగితే సాయి పల్లవికి అని చెప్పారు.

సాయి పల్లవికి తండ్రిగా అనగానే.

సాయి పల్లవికి తండ్రిగా అనగానే.

తండ్రి పాత్ర అనగానే నాకు పెళ్లి పెటాకుల లేవు. పిల్లలు లేరు. అలాంటి వ్యక్తినైన నన్ను తండ్రిగా నటించాలన్నప్పుడు చాలా షాక్ గురయ్యాను. ఉత్తమ అభిరుచి ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, మంచి నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్న సినిమా ద్వారా మళ్లీ తెరమీద కనిపించాను. ఆ అవకాశం ఇచ్చిన శేఖర్, రాజులకు థ్యాంక్స్ అని సాయిచంద్ పేర్కొన్నారు

సాయిపల్లవికి తండ్రి అనగానే వావ్.

సాయిపల్లవికి తండ్రి అనగానే వావ్.

ఇంటికి వచ్చిన తర్వాత నా మేన కోడలు పాత్ర ఏమిటి అని అడిగింది. సాయి పల్లవికి తండ్రిగా అని చెప్పగానే వావ్.. అని ఆమె ఫోటో చూపించింది. ఎందుకంటే నాకు సాయి పల్లవి ఎవరో తెలియదు. మలయాళ సినిమాలు అసలికే తెలియదు. ఈ పిల్లకా తండ్రిని అనిపించింది. వెంటనే ఈ పిల్లకా అని ఆనందం కలిగింది. కొన్ని రోజుల తర్వాత రిహార్సల్‌కు పిలిచారు. ఆమెను చూడగానే మాయాబజార్‌లో సావిత్రిలా సాయి పల్లవి మళ్లీ కనిపించింది. సాయి పల్లవి గొప్ప నటి. చిన్న వయసులో అంతటి నటనా పరిణతి ఓ నటిలో చూడటం ఇదే తొలిసారి అని అన్నారు.

వరుణ్‌లో ఎలాంటి భేషజాలు లేవు..

వరుణ్‌లో ఎలాంటి భేషజాలు లేవు..

ఈ చిత్రం విషయానికి వస్తే వరుణ్ తేజ్ గురించి చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్‌లో ఎలాంటి భేషజం లేదు. వరుణ్ పెదనాన్న చిరంజీవితో 30 ఏళ్ల క్రితం మంచు పల్లకిలో నటించాను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మెగా హీరో వరుణ్ నటించాను. చిరంజీవితో నటించినప్పుడు పిక్నిక్ వెళ్లినట్టు ఉండేది. చిరంజీవిలో ఉండే లక్షణాలే మళ్లీ వరుణ్‌లో చూశాను. చాలా కలుపుగోలుగా ఉన్నాడు. వరుణ్‌తో వర్క్ చేయడం చాలా బాగుంది అని సాయిచంద్ అన్నారు.

ఫిదాతో మానవ సంబంధాలు..

ఫిదాతో మానవ సంబంధాలు..

నా పెద్ద కూతురిగా శరణ్య, అల్లుడిగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి రాజా నటించాడు. అప్పుడప్పుడు మా వియ్యంకుడు సీతారాం శాస్త్రి ఎలా ఉన్నారని ఆటపట్టించే వాడిని. ఈ సినిమాలో నటించిన వారందరం ఓ కుటుంబంలా మారిపోయాం. మానవ సంబంధాలు ఏర్పడ్డాయి. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటాయి అన్నారు.

శేఖర్ కమ్ముల గొప్పవ్యక్తి

శేఖర్ కమ్ముల గొప్పవ్యక్తి

శేఖర్ కమ్ములతో మాట్లాడిన తర్వాత గొప్పగా అనిపించింది. ఆయనే కాదు ఆయన కుటుంబంలోని ప్రతీ ఒక్కరు చాలా మంచివాళ్లు. అలాంటి దర్శకుడితో నటించడం గొప్ప అదృష్టంగా భావించాను. ఈ కాలంలో కూడా ఇంత మంచి వాళ్లు ఉంటారా అనిపించింది అని సాయిచంద్ ప్రశంసల వర్షం కురిపించారు.

విజయ్ కుమార్ గొప్ప కెమెరామెన్

విజయ్ కుమార్ గొప్ప కెమెరామెన్

కెమెరా మెన్ విజయ్‌ సి కుమార్ తో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన తండ్రి నాగేశ్వరరావు గురించి నాకు తెలుసు. ఆయన మార్కెజ్ భట్ అనే గొప్ప కెమెరామెన్ వద్ద పనిచేశాడు. అంతటి గొప్ప కెమెరామెన్ కుమారుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం గొప్పగా అనిపింది. ఈ సినిమా నాకెంతో ఇచ్చింది. అందుకు శేఖర్ కమ్ముల, రాజాకు థ్యాంక్ అని సాయిచంద్ ఉద్వేగంగా ప్రసంగించారు.

English summary
Director Sekhar Kammula's Telugu movie Fidaa is a romance drama starring Varun Tej and Sai Pallavi. After release of this movie got huge response from audience. In audio function Sai chand gets emotional. Dil Raju has bankrolled Fidaa under his banner Sri Venkateswara Creations and he has made sure that the film has brilliant production values.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu