»   » ‘బాడ్కావ్ బలిసిందారా’ సాయి పల్లవి డైలాగ్ అర్థం తెలిస్తే షాకవుతారు!

‘బాడ్కావ్ బలిసిందారా’ సాయి పల్లవి డైలాగ్ అర్థం తెలిస్తే షాకవుతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్టయిందంటే.... ప్రధాన కారణం సాయి పల్లవి. ఆమె సినిమాలో మాట్లాడిన తెలంగాణ యాస. భవిష్యత్తులో ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయినా సాయి పల్లవి క్యారెక్టర్, ఆమె చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.

ఈ సినిమాలో సాయిపల్లవి ఓ సీన్లో 'బాడ్కావ్ బలిసిందారా... బొక్కలిరగ్గొడతా' అంటూ ఓ వ్యక్తిని తిడుతుంది. ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ డైలాగులో బలిసిందారా, బొక్కలిరగ్గొడతా అర్థం అందరికీ తెలిసిందే కానీ 'బాడ్కావ్' అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. చాలా మంది ఈ పదం అర్థం కోసం నెట్లో అన్వేషిస్తున్నా సరైన జవాబు దొకరడం లేదట.


బాడ్కావ్

బాడ్కావ్

తెలంగాణ ప్రాంతంలో బాడ్కావ్ అనేది సాధారణంగా వినిపించే ఒక చెడ్డ పదం. అయితే దాని అర్థం మాత్రం ఇప్పటి జనరేషన్లో చాలా మందికి తెలియదు. ఇక ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన వారు ఈ పదం వినడమే చాలా అరుదు. ‘బాడ్కావ్' పదానికి అర్థం చాలా మంది ‘వెదవ(ఫూల్)' అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు.


Sai Pallavi's Fidaa Dialogue 'Bhaadkaav' Meaning
అదో తిట్టు

అదో తిట్టు

బాడ్కావ్ అనేది ఒక తిట్టు. ఒకరిని తిట్టే క్రమంలో తెలంగాణలో ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. వాస్తవానికి దీన్ని తెలంగాణ పదం అనడం కూడా సరికాదు. ఇది ‘దక్కని' లాంగ్వేజ్ నుండి వచ్చి పదం. నిజాం నవాబు కాలంలో తెలంగాణ, మరాఠీ, ఉర్దూ ఇలా మూడు మిలితమై ఉండే బాష మాట్లాడే వారు. దీన్నే ‘దక్కని' లాంగ్వేజ్ అంటారు.


అర్థం ఇదే...

అర్థం ఇదే...

బాడ్కావ్ అనే పదానికి అర్థం...అమ్మాయిల బ్రోకర్ అని అర్థం. ఈ వర్డ్ క్యాచీగా ఉండటంతో శేఖర్ కమ్ముల ఈ పదాన్ని తన సినిమాలో వాడేశాడు. ఈ డైలాగ్ సాయి పల్లవి నోట రావడంతో మరింత పాపులర్ అయింది.


ఇప్పటి బూతులతో పోల్చుకుంటే..

ఇప్పటి బూతులతో పోల్చుకుంటే..

‘బాడ్కావ్' అనేది ఎదుటి వ్యక్తి కించ పరిచే ఒక తిట్టు. ఇపుడు ఇంగ్లీషు, హిందీ, తెలుగు బాషలోని ఇంతకంటే దారుణమైన బూతు పదాలు ఈ తరం జనరేషన్ వాడుతున్నారు. వాటితో పోల్చుకుంటే ‘బాడ్కావ్' అనేది అంత సీరియస్ వర్డ్ ఏమీ కాదు.English summary
"Bhaadakaav balisindera.. Bokkalu Iraggodata" is one popular dialogue of Sai Pallavi as she's introduced as Bhanumati to us in Fidaa. Bhaadkhaav is an explicit term which means that one is living off the income of prostitutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu