twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఫిదా’ మూవీ సక్సెస్ సంబురాలు (ఫోటోస్)

    ఫిదా మూవీ సక్సెస్ సంబరాలు మొదలయ్యాయి. ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.

    By Bojja Kumar
    |

    వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫిదా'. ఈ చిత్రం జూలై 21న విడుదలై యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌తో విజయదుందుభి మ్రోగిస్తోంది. ఈ చిత్రం సక్సెస్‌ సంబరాలు జూలై 27న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రారంభమయ్యాయి.

    ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌, నాగబాబు, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి, హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, సంగీత దర్శకుడు శక్తి కార్తీక్‌, జె.బి, నటుడు సాయిచంద్‌, రాజు, శరణ్య, గీత, సత్యం రాజేష్‌, గేయ రచయితలు సుద్దాల అశోక్‌ తేజ, వనమాలి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

    శేఖర్ కమ్ములపై ప్రశంసలు

    శేఖర్ కమ్ములపై ప్రశంసలు

    'ఫిదా' సినిమాలో తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ యాసని కళ్లకు కట్టినట్లుగా చూపించి దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు ప్రేక్షకులందరినీ 'ఫిదా' చేశారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    ఈర్ష్య కలుగుతోంది

    ఈర్ష్య కలుగుతోంది

    అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘ఫిదా'లాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు. ఒక పల్లెటూరు వాతావరణంలో, నేటివిటీ మిస్‌ అవకుండా పచ్చని పొలాలు తీశారు శేఖర్‌ కమ్ముల. ప్రతి ఒక్కళ్లు సినిమా చూసి హ్యాపీ ఫీలింగ్‌తో బయటికి వస్తున్నారు. శేఖర్‌ కమ్ముల కెరీర్‌లో 'ఫిదా' బెస్ట్‌ సక్సెస్‌ అని ఫీలవుతున్నాను అన్నారు. వరుసగా దిల్‌ రాజు సక్సెస్‌లు సాధిస్తున్నారు. అతన్ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది అన్నారు. వరుణ్‌ ఈ సినిమాలో చాలా నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. సాయి పల్లవి గ్రేట్‌ టాలెంట్‌ కలిగిన ఆర్టిస్ట్‌. మంచి డ్యాన్సర్‌ కూడా. ఈ సినిమా అంతా తన షోల్డర్‌పై వేసుకొని బాగా క్యారీ చేసిందన్నారు.

    తెలంగాణ మట్టివాసన విదేశాలకు చాటి చెప్పారు

    తెలంగాణ మట్టివాసన విదేశాలకు చాటి చెప్పారు

    ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ... తెలంగాణ మట్టి వాసనని, దేశ విదేశాలకు చాటి చెప్పిన చిత్రం 'ఫిదా'. ఇంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన శేఖర్‌ కమ్ములకి హ్యాట్సాఫ్‌. తెలంగాణలో హృషికేశ్‌, గుల్జర్‌లాంటి ఒక గొప్ప దర్శకుడు వచ్చాడు అన్నారు.

    ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోను హిట్

    ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోను హిట్

    హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ... 'ఫిదా' సక్సెస్‌ సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. సాయి పల్లవి క్యారెక్టర్‌కి చాలా మంచి అప్లాజ్‌ వస్తోంది. ఈ చిత్రంలో భానుమతి క్యారెక్టర్‌ లేకపోతే 'ఫిదా' లేదు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు హిట్ చేస్తారని మరోసారి నిరూపించారు అని వ్యాఖ్యానించారు.

    దిల్‌ రాజు లేకపోతే ఈ సినిమా హిట్‌ అయ్యేది కాదు

    దిల్‌ రాజు లేకపోతే ఈ సినిమా హిట్‌ అయ్యేది కాదు

    మెగా బ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ... ‘దిల్‌ రాజు లేకపోతే ఈ సినిమా హిట్‌ అయ్యేది కాదు. కథను నమ్మి ఇష్టంతో తీశారు. ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్‌, బాపుల తర్వాత గోదావరి అందాల్ని, విలేజ్‌ నేటివిటీని అందంగా చూపించే దర్శకుల్లో శేఖర్‌ కమ్ముల ఒకరు. సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్‌ అద్భుతంగా చేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయాం. 'మిస్సమ్మ'లో సావిత్రిలా 'ఫిదా'లో సాయి పల్లవి అంత అద్భుతంగా చేసింది. వరుణ్‌ చాలా నేచురల్‌గా యాక్ట్‌ చేశాడు అన్నారు.

    ఈ సినిమా ఆత్మ తెలంగాణ

    ఈ సినిమా ఆత్మ తెలంగాణ

    దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ... 'ఫిదా' మూవీ సినిమా ఆత్మ తెలంగాణ. జానపదాలు, బతుకమ్మ పాటలు చిన్నప్పుడు నుండి వినేవాడిని. తెలంగాణ యాస అన్నా, భాష అన్నా చిన్నప్పటి నుండి ఇష్టం. ఈ సినిమాకి గుండెకాయ సాయి పల్లవి. తెలంగాణ భాష నేర్చుకుని ఓన్‌గా డబ్బింగ్‌ చెప్పింది. వరుణ్‌ చాలా నేచురల్‌గా క్యారెక్టర్‌కి తగ్గట్లు పెర్‌ఫార్మ్‌ చేశాడు. నాకు సహకరించిన ఆర్టిస్ట్‌లకి, టెక్నీషియన్స్‌ అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.

    సాయి పల్లవి

    సాయి పల్లవి

    హీరోయిన్‌ సాయి పల్లవి మాట్లాడుతూ...సినిమా ఇంత పెద్ద హిట్టయినందుకు ఆనందంగా ఉంది. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా మా టీమ్‌కే చెందుతుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శేఖర్‌ కమ్ముల, దిల్‌ రాజుగారికి నా థాంక్స్‌ అన్నారు.

    బొమ్మరిల్లు తర్వాత పెద్ద హిట్

    బొమ్మరిల్లు తర్వాత పెద్ద హిట్

    నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ... నేను ఫారిన్‌లో ఉన్నప్పుడు రిలీజ్‌కి ముందే శేఖర్‌ కమ్ముల, మార్తాండ్‌ కె.వెంకటేష్‌ ఫీల్‌ గుడ్‌ మూవీ చాలా బాగా వచ్చింది అని నాకు మెస్సేజ్‌ పెట్టారు. 'బొమ్మరిల్లు' టైమ్‌లో కడప నుండి సినిమా సూపర్‌హిట్‌ అని కాల్‌ వచ్చింది. ఇప్పుడు నెల్లూరు నుండి వచ్చింది. 'బొమ్మరిల్లు' తర్వాత మళ్లీ మా బేనర్‌లో మరొక పెద్ద హిట్‌ లభించింది. ప్రేక్షకులకి థాంక్స్‌ తెలపడానికి 'ఫిదా' సంబరాలు స్టార్ట్‌ చేశాం. ఇది ఇంకా కంటిన్యూగా సాగుతుంది అన్నారు.

    English summary
    Varun Tej, Sai Pallavi acted Dil Raju Produced, Shekar Kammula directed Fidaa movie hit Sucess (Samburalu) celebrated at Prasad Labs, Jubilee Hills, Hyderabad on Thursday (27th July) evening. Allu Aravind, Naga Babu, R Narayana Murthy, Music director Shakti Karthik, JB, Sai Chand, Raju, Saranya, Geeta, Satyam Rajesh, Suddla Ashok Teja, Vanamali, Chaitanya and Varun Tej, Sai Pallavi attended the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X