»   » సాయి పల్లవి రెబల్ యాటిట్యూడ్: 'ఫిదా' చేస్తోన్న కొత్త ట్రైలర్!

సాయి పల్లవి రెబల్ యాటిట్యూడ్: 'ఫిదా' చేస్తోన్న కొత్త ట్రైలర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా మరో ట్రైలర్ విడుదల చేశారు. మొదటి ట్రైలర్ కంటే ఈ రెండో ట్రైలర్ మరింత ఆసక్తికంగా ఉంది.


ఈ సినిమాలో హీరో సాఫ్ట్ నేచుర్ అయితే హీరోయిన్ రెబ‌ల్‌. ఇలా ఇద్ద‌రు వేర్వేరు మ‌న‌స్త‌త్వాలుండే వ్య‌క్తుల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌. దీంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో న‌డిచే క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది.


తెలంగాణ యాసతో సాయి పల్లవి ఆకట్టుకుంటోంది. చూస్తుంటే సినిమాలో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవి హైలెట్ అయ్యేలా ఉంది. వ‌రుణ్ కెరీర్‌లో అనుకున్న స్థాయిలో హిట్ లేదు. ఫిదా వ‌రుణ్‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ ఫిలిం అయ్యేలా ఉంది.


ఫిదా ఆంధ్ర‌, తెలంగాణకు చెందిన ప్రేమ‌క‌థ కాదు. అమ్మాయి తెలంగాణ‌కు చెందిన భాన్సువాడ‌, అబ్బాయి యు.ఎస్‌లో సెటిల్ అయిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందిన‌వాడు. అయితే ఇది ప్రాంతాల‌కు చెందిన ప్రేమ క‌థ కాదు. ఓ పెళ్ళిలో క‌లిసిన హీరో హీరోయిన్లు వారి క‌ల‌ల‌ను ఎలా నేర‌వేర్చుకున్నార‌నేదే క‌థ‌.


English summary
Checkout Sekhar Kammula's Fidaa New Official trailer featuring Varun Tej & Sai Pallavi. Movie releasing on 21st JULY.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu