»   » మెగా-నందమూరి ఫ్యామిలీ ల మద్య ఆదిపత్య పోరు ఈనాటిది కాదు..!

మెగా-నందమూరి ఫ్యామిలీ ల మద్య ఆదిపత్య పోరు ఈనాటిది కాదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఆధిపత్య పోరు ఉందా? అంటే, 'తప్పకుండా వుంది' అన్న సమాధానాన్నే చెబుతారు ఎవర్నడిగినా. గతంలో యన్టీఆర్, ఏఎన్నార్ ల మధ్య వుంటే, ఆ తర్వాత కాలంలో యన్టీఆర్-కృష్ణల మధ్య వుండేది. ఆ తర్వాత అది చిరంజీవి-బాలకృష్ణల మధ్య మొదలైంది. సుమారు రెండున్నర దశాబ్దాల పాటు ఇది కొనసాగింది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా కూడా అది ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వెర్సస్ నందమూరి ఫ్యామిలీల మధ్య కంటిన్యూ అవుతోంది. ఈ రెండు వర్గాల వాళ్లు ఎక్కడైనా ఫంక్షన్ లో కలుసుకున్నా.. పైకి నవ్వుకుంటూ ఆలింగానాలు చేసుకున్నా...ఆ ఆధిపత్యతత్వం మాత్రం పదిలంగానే వుంది!

ఈ సమ్మర్ లో విడుదలయ్యే రెండు సినిమాల రిలీజుల విషయంలో ఇది మరింతగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'తీన్ మార్' చిత్రం, యన్టీఆర్ నటిస్తున్న 'శక్తి' చిత్రం రెండూ మార్చి నెలాఖరుకి విడుదలవుతున్నాయి. రెండు సినిమాలూ కూడా భారీ చిత్రాలే అయినప్పటికీ, ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో... ఏది నచ్చదో... ఏది విజేతగా నిలుస్తుందో అన్నది టాలీవుడ్ లో అందరికీ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఇలా రెండు సినిమాలూ ఒకే సమయానికి రిలీజ్ కావడం అన్నది యాదృచ్చికమే అయినా, అభిమానులు మాత్రం దీనిని రసవత్తరమైన పోటీగానే తీసుకుంటున్నారు.

English summary
The signals and messages are strong in Film Nagar inner circles that pawan kalyan and Junior NTR may compete again this time. Yes, the release dates of ‘Shakti’ and ‘Teen Maar’ may fall in the same vicinity in March and obviously when it is the clash between titans, we get much more interesting and competitive outputs.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu