»   »  నీవు ఇలా చీరకడితే.. యువకులు ఏమై పోవాలి.. ఉదయభానుకు ఫైట్ మాస్టర్ పంచ్

నీవు ఇలా చీరకడితే.. యువకులు ఏమై పోవాలి.. ఉదయభానుకు ఫైట్ మాస్టర్ పంచ్

Written By:
Subscribe to Filmibeat Telugu

కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత యాంకర్ ఉదయభాను ఇప్పుడిప్పుడే వరుస కార్యక్రమాలతో టాలీవుడ్‌లో హడావిడి చేస్తున్నారు. ఇటీవల సినీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ఆమె అదరగొడుతున్నారు. సాధారణంగా సినిమా ఫంక్షన్లంటే పొగడ్తలతో ముంచెత్తడంగా మారింది. సదరు సినీ నటులను, నిర్మాత, దర్శకులతోపాటు సాంకేతిక నిపుణులపై ప్రశంసల కురిపించడం యాంకర్ల పనిగా మారింది. అదే క్రమంలో తాజాగా సంపత్ నది రూపొందించిన గౌతమ్ నంద చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఉదయభానుకు సరదా సంఘటన ఎదురైంది. అందేమింటంటే..

గౌతమ్‌నంద ఆడియోలో ఉదయభానుకు పంచ్

గౌతమ్‌నంద ఆడియోలో ఉదయభానుకు పంచ్

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్‌నంద సినిమా ఆడియో ఫంక్షన్‌లో యాంకర్‌ ఉదయభాను హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉదయభానుకు ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్ గట్టిగానే పంచ్ ఇవ్వడంతో ఆమె బెదిరిపోయారు. అంతలోనే తమాయించుకొని ఉదయభాను కార్యక్రమానికి ముందుకు నడిపించారు.

మా మీద అభిమానం కొద్ది బాగానే చెప్పారు..

మా మీద అభిమానం కొద్ది బాగానే చెప్పారు..

గౌతమ్‌నంద ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఫైట్ మాస్టర్లు రామ్, లక్షణ్‌లను కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ వారి గురించి కాస్త ఎక్కువగానే ఉదయభాను ప్రశంసలతో ముంచెత్తింది. అయితే వేదికపైకి చేరుకొన్న ఫైట్ మాస్టర్లు తమదైన శైలిలో స్పందించారు. ‘మా గురించి ఉదయభాను గారు చాలా చెప్పారు. కానీ అదంతా నిజం కాదు. ఏదో మా మీద అభిమానం కొద్దీ ఆమె అలా చెప్పారు. అంతటి పొగడ్తలకు తాము అర్హులం కాము. అవన్నీ అవసరం లేదు అని రామ్ లక్ష్మణ్ అన్నారు.

Hot Beauties In Black : Actress Black Dress Photos
ఇలా చీరలో వస్తే కుర్రాళ్లు ఏమై పోవాలి

ఇలా చీరలో వస్తే కుర్రాళ్లు ఏమై పోవాలి

రామ్ లక్ష్మణ్‌లు అదే ఫ్లో మాటలను కొనసాగిస్తూ ఉదయభాను డ్రస్సింగ్స్‌పై సటైర్ వేశారు. వేదికలపైన మీరు అడుగు పెడితేనే ఆ ఫంక్షన్ వెలిగిపోతుంది. అలాంటిది నిగనిగ మెరిసిపోయే చీరలో మీరు వస్తే యువకుల పరిస్థితి ఏం కావాలమ్మా అంటూ రామ్ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారి మాటలకు ఉదయభాను పొంగిపోయింది.

ఉదయభాను మా ఫెవరేట్ హీరోయిన్

ఉదయభాను మా ఫెవరేట్ హీరోయిన్

రామ్ లక్ష్మణ్ ఇంకా మాట్లాడుతూ.. 'యాంకర్ ఉదయభాను మా ఫేవరేట్ హీరోయిన్. మేం హీరోలుగా నటించిన ఖైదీ బ్రదర్స్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో నటించిన అభిమానంతో మమ్మల్ని కాస్త ఎక్కువగా పొగిడారు. అప్పటి కాలంలో తమ హీరోయిన్ కాబట్టే.. ఇప్పుడు తమకు ఓవర్‌గా ఉదయభాను బిల్డప్ ఇస్తున్నారు అని అన్నారు.

మళ్లీ జోష్ పెంచమంటున్నారు..

మళ్లీ జోష్ పెంచమంటున్నారు..

రామ్ లక్ష్మణ్ మాటలకు స్పందిస్తూ ‘కొన్ని కారణాల వల్ల సుమారు మూడేళ్లుగా సినిమా వేదికలపైన, యాంకర్‌గా కనిపించలేదు. కొంత గ్యాప్ వచ్చింది. చాలామంది ఏమిటీ కనిపించకుండా పోయారు. యాంకర్‌గా మళ్లీ జోష్ పెంచండి అంటూ నన్ను అడుగుతున్నారు. అందుకే మళ్లీ వేదికలపై కనిపిస్తున్నాను' అని ఉదయభాను అన్నారు.

English summary
Fight master Ram Laxman satire on anchor Udaya Bhanu in Gautamnanda Audio function. They said that youth will spoil if you come in nice saree for functions. She acted as heroin along with Ram Laxman in Khaidi Brothers movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu