»   »  శరీరాన్ని ఎలా వంచాలో నేర్చుకోవటం కోసమే...

శరీరాన్ని ఎలా వంచాలో నేర్చుకోవటం కోసమే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sushmita Sen
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ త్వరలో చైనా వెళ్ళనుంది. హఠాత్తుగా అక్కడామెకు ఏం పనివచ్చింది అంటే హార్స్ రైడింగ్,కత్తి ఫైటింగ్,ఇంకా రకరకాల స్టంట్స్ విన్యాసాలు నేర్చుకోవటానికి. అవి దేనికీ కర్మజాలి స్టంట్ మాస్టర్ గా అవతారం ఎత్తనున్నావా అదేంలేదు...షూటింగ్ కోసం అంది. షూటింగ్ కోసమా ...అని షాకయ్యితే త్వరలో తాను ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించనున్న ఝాన్సి రాణి చిత్రంలో ఫైటింగ్ సన్నివేశాలు భారీగా ఉన్నాయంటోంది. చైనాలో అయితే ఆ సన్నివేశాలకనుగుణమైన స్టంట్స్ నేర్పే గురువులు ఎక్కువమంది ఉన్నారంటోంది. అవి నేర్చుకుంటే శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచవచ్చునని చెబుతోంది.

త్వరలో సుస్మిత దర్శకత్వంలో ప్రారంభంకానున్న ఝాన్సీరాణి చిత్రం కోసం ఆమె భారీగానే కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కోసం చాలా మంది రచయితలను మార్చి,రైటర్స్ హంట్ పెట్టిన ఆమె ఇప్పడు స్టంట్ మాస్టర్స్ హంట్ పెట్టింది. అయినా మరీ ఛాదస్తం కాకపోతే మనదేశంలో ఆ మాత్రం నేర్పేవారు లేరా అంటే...ఇక్కడ ఆమె ఇమేజ్ చూసి భయపడి సరిగ్గా కోఅపరేట్ చేయరని భయం అని ఆమె చెప్తోంది. ఇక ఇప్పటికైనా పెళ్ళి చేసుకుంటావా అంటే మాత్రం ముందు ఈ డైరక్షన్ గొడవ పూర్తవనివ్వండి..అప్పుడు ఆలోచిద్దాం అంటోంది. సర్లే మరిప్పుడు బయిలు దేరుతున్నావు అంటే మా మేనేజర్ కృష్ణ బెనర్జీనీ అడగండి షెడ్యూల్ డిటేల్స్ ఇస్తాడంటోంది. ఇంకా షూటింగ్ మొదలవ్వలేదమ్మా...కాస్తంత తగ్గు అంటున్నారు బాలీవుడ్ వాసులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X