»   » ‘యాక్షన్ 3డి’ చూస్తే...డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్క్!

‘యాక్షన్ 3డి’ చూస్తే...డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్క్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 21న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్ సరికొత్తగా నిర్వహిస్తున్న నిర్మాతలు.....మా సినిమా చూడండి, డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్స్ పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా 'సినిమా చూసిన తర్వాత మీ టికెట్ నెంబర్, పర్సనల్ డీటేల్స్ '56263' అనే నెంబర్‌కి ఎస్ఎంఎస్ చేయండి. లేదా action3dofficial@gmail.com కి ఈ-మెయిల్ చేయడం. అన్ని ఖర్చులు వారే భరిస్తారు. ఇంకేం...ఈ నెల 21న విడుదలవుతున్న సినిమా చూసి మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి.

వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ఇతర ముఖ్య పాత్రదారులు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రం.

ఈ చిత్రానికి కెమెరా : సర్వేష్ మురారి, 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

English summary
Moviegoers, who will buy ticket to watch upcoming Telugu romantic-comedy Action 3D, releasing June 21, may win a paid trip to Disneyland. The movie producer are taking up innovative promotions to get people watch their movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X