twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణా సోదరులకే నష్టం..మురళీ మోహన్

    By Srikanya
    |

    తెలంగాణా ప్రాంతంలో విడుదలవుతున్న సినిమాల ప్రదర్శనలను ఆపు చేయడం వల్ల ఆ ప్రాంతానికి చెందిన పంపిణీదారులు, ప్రదర్శకులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు కనుక ఇప్పటికే విడుదలయిన 'సలీం', 'ఆర్య-2', మగధీర', 'అమరావతి' చిత్రాల ప్రదర్శనను అడ్డుకోవద్దంటూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీని హైదరాబాద్‌ స్టేట్‌ ఫిలిం ఛాంబరు విజ్ఞప్తి చేసింది. ఛాంబర్‌ కార్యవర్గ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛాంబరు అధ్యక్షుడు ఎం.విజయేందర్‌ రెడ్డి, కార్యదర్శి కె.మురళీమోహన్‌ మాట్లాడుతూ 'అన్ని ఛాంబర్‌లకంటే స్టేట్‌ ఫిలిం ఛాంబరు పాతది. తెలంగాణా జిల్లాల ప్రతినిధులే ఇందులో సభ్యులు. ఛాంబరు పేరుని 'తెలంగాణా రాష్ట్ర ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌గా మార్చాలని మేం కోరుతూ పంపిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో విడుదలయిన సినిమాలను ఆపడం వల్ల మన తెలంగాణ సోదరులే నష్టపోతున్నారు. థియేటర్లు బంద్‌ చేయడం వల్ల సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంతంలో విడుదలయ్యే అన్ని చిత్రాలకు సహకరించాలి కోరుతున్నాం' అన్నారు. తెలంగాణా ప్రాంతాల్లో చిరంజీవి,మోహన్ బాబు కుటుంబాలకి సంభందించిన హీరోల చిత్రాలు ఆడనివ్వనంటూ ఆర్య-2, సలీం, మగధీర చిత్రాలు ఆపుచేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ అదుర్స్ చిత్రం కూడా ఆడనివ్వనటనటంతో వారి రిలీజ్ ఆపుచేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X