చిదంబరం బడ్జెట్: సినిమా రంగానికి శుభవార్త

సినిమా రంగంపై సేవా పన్ను(సర్వీస్ టాక్స్)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆయా సినీ పరిశ్రమలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య దేశ వ్యాప్తంగా సినిమా బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. దేశంలోని సినిమా పరిశ్రమ మొత్తం ఏకమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మెట్టు దిగింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే నష్టాల్లో సాగుతున్న సినిమా రంగంపై పన్ను విధించడం సరికాదని, తమ కష్టాలను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఆ మధ్య పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు జరిగిన ఆందోలన కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్, నాగిరెడ్డి, అలీ, హీరో సునీల్, శివాజీ రాజా, దర్శకుడు తేజతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇప్పటికీ వారి పోరాటం ఫలించినందుకు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











