»   » తెరకెక్కనున్న క్రీడాద్బుతం: భారత చరిత్ర లోనే అపూర్వ ఘట్టం "వరల్డ్ కప్"

తెరకెక్కనున్న క్రీడాద్బుతం: భారత చరిత్ర లోనే అపూర్వ ఘట్టం "వరల్డ్ కప్"

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతదేశంలో వినోదరంగాన్ని శాసిస్తున్న క్రికెట్‌కీ, సినిమాకీ మధ్య చాలా అనుబంధం ఉంది. క్రికెట్‌ నేపథ్యంతో సినిమాలు తెరకెక్కించడం, క్రికెటర్లు సినిమాల్లో నటించడం మనం చూస్తూనే వున్నాం. భారతదేశంలో వినోదరంగాన్ని శాసిస్తున్న క్రికెట్‌కీ, సినిమాకీ మధ్య చాలా అనుబంధం ఉంది. క్రికెట్‌ నేపథ్యంతో సినిమాలు తెరకెక్కించడం, క్రికెటర్లు సినిమాల్లో నటించడం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు భారతీయ క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన 1983 వరల్డ్‌ కప్‌ విజయం తాలూకా మధుర క్షణాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది.

ఇప్పుడు భారతీయ క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన 1983 వరల్డ్‌ కప్‌ విజయం తాలూకా మధుర క్షణాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది.కపిల్ సేన క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన క్షణాలవి. ఆ అరుదైన సందర్భాన్నే మళ్లీ కళ్లముందుంచడానికి సిద్ధమవుతున్నాడో క్రికెట్ ప్రేమికుడు. త్వరలో సినిమాగా రాబోతోంది. 83 వరల్డ్ కప్ విజయం. క్రికెట్ లో పసికూనగా ఉన్న ఇండియా... అరివీర భయంకర బౌలర్లను.. బ్యాట్స్ మెన్లను ఎదుర్కొని అపురూప విజయాలను సొంతం చేసుకుంది.

Film on India's 1983 World Cup win to go on floors by September

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు విష్ణు ఇందూరి. 83 వరల్డ్ కప్ విజయం ఇచ్చిన కిక్... దేశాన్ని ఎలా మార్చిందో చెప్పడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందంట. రెండేళ్ల నుంచి దీనిపై వర్క్ చేస్తున్నారట. బడ్జెట్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. సుమారు 90 కోట్ల రూపాయలతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట విష్ణు. ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో ఆయన మాట్లాడారట. అంతేకాదు ఆనాటి వరల్డ్ కప్ విజయంలో పాలుపంచుకున్న క్రికెటర్లతో కూడా మాట్లాడినట్టు చెబుతోంది విష్ణు టీమ్. వాళ్ల పేర్లను సినిమాలో ఉపయోగించుకోవడంపై చర్చించారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నవంబర్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ఇందుకోసం 1983 వరల్డ్‌ కప్‌ విజయంలో పాలుపంచుకున్న క్రికెటర్లతో ఒక ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం క్రికెటర్ల పేర్లను సినిమాలో అలాగే ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ, '1983 జట్టు పయనం స్ఫూర్తిదాయకమైన కథ. ఎవరైనా ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరు అనడానికి ఆ విజయమే సాక్షి' అన్నారు. కాగా ఈ చిత్రం 2017లో సెట్స్‌పైకి వెళ్లనుందని నిర్మాత తెలిపారు.

English summary
Official 1983 Cricket World Cup victory film happening, Kapil Dev and Phantom Films confirm
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu