»   »  పరుగుల రాణి పీటీ ఉష కథతో...చిత్రం

పరుగుల రాణి పీటీ ఉష కథతో...చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Film on PT Usha's life and career?
ముంబై : మిల్కాసింగ్‌ జీవిత కథతో తెరకెక్కిన 'భాగ్‌ మిల్కా భాగ్‌' చిత్రం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో క్రీడాకారుల జీవితాల్ని తెర మీదకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రాతో మేరీ కోమ్‌ జీవిత కథను ఉమంగ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ధ్యాన్‌చంద్‌ జీవితం ఆధారంగా మరో చిత్రం రూపొందబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా పరుగుల రాణి పి.టి.ఉష జీవిత కథను తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

పి.టి.ఉష భర్తను ఓ దర్శకనిర్మాత వెళ్లి అడిగినట్లు తెలిసింది. అయితే ఆయన తన నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తానని చెప్పారట. పి.టి.ఉష మాట్లాడుతూ ''మిల్కా సింగ్‌ కథతో వచ్చిన 'భాగ్‌ మిల్కా భాగ్‌' చూశాను. యువతరానికి మార్గదర్శకంగా ఉంది. నా జీవిత కథతో సినిమా తీయాల్సిన సమయం వచ్చేసిందని నమ్ముతున్నాను''అని తెలిపింది. అయితే పి.టి ఉష గా ఎవరు చేస్తారనేది ప్రశ్నగా మిగిలింది. ప్రియాంక చోప్రానే చేసే అవకాసం ఉందని వార్తలు సైతం వినపడుతున్నాయి.

ఇక ఫ్లైయింగ్‌ సిఖ్‌గా పేరొందిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిందీ చిత్రం భాగ్‌ మిల్కా భాగ్‌ అమెరికాలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాక్సాఫీసు దగ్గర విజయకేతనం ఎగరేసి విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సంపాదించిందని సినీ వ్యాపార వర్గాలు తెలిపాయి. యూఎస్‌ పాపులారిటీ చార్జ్‌టో 15వ స్థానంలో ఈ సినిమా నిలిచింది. 140 థియేటర్లలో సినిమా ఆడుతోంది.

కల్పిత పాత్రలకంటే నిజజీవిత పాత్రలు పోషించడానికే నేటి తారలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వైనాన్ని ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం. బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రా కూడా త్వరలో అలాంటి పాత్ర వెండితెరపై పోషించబోతోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ఒలింపిక్స్ లో పాల్గొని, బాక్సింగు క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన మణిపూర్ మణిపూస మేరీ కోమ్ పాత్రను ఇప్పుడు ప్రియాంకా పోషించబో తోంది. బాక్సర్ గా ఎదిగే క్రమంలో మేరీ కోమ్ తన జీవితంలో ఎదుర్కున్న అనుభవాల నేపథ్యంలో సంజయ్ లీలాభన్సాలీ రూపొందిస్తున్న ఈ హిందీ చిత్రం షూటింగు జనవరి నుంచి మొదలవుతుంది. మేరీ జీవితం తననెంతో ఇన్స్ పైర్ చేసిందని, అందుకే ఈ పాత్ర చేయడానికి మరో ఆలోచన లేకుండా అంగీకరించాననీ ప్రియాంకా చెబు తోంది. ఒమంగ్ కుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
India's sprint legend PT Usha's life is set to get a big screen treatment after biopic Bhaag Milkha Bhaag on 'Flying Sikh' Milkha Singh. "Somebody approached my husband to do a film based on my life and career. He didn't say yes or no to the person," Usha told . However, the athlete from Kerala said the time is yet to come to make a film on her. "The film on Milkha Singh released at the right time. A film on my life can wait as my task is unfinished. I am still into athletics," she said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu