»   »  రాజశేఖర్ రెడ్డి జీవితంపై చిత్రం మొదలైంది

రాజశేఖర్ రెడ్డి జీవితంపై చిత్రం మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుమన్‌, సంఘవి, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'జై రాజశేఖరా'. సుబ్బారెడ్డి దర్శకుడు. అప్పారావు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ క్లాప్‌నిచ్చారు.

సుమన్‌ మాట్లాడుతూ ''దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జీవితంలోని అంశాల్ని స్పృశించేలా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తామన్నారు. చిత్రంలో కొండవలస, కృష్ణభగవాన్‌, రఘుబాబు, అలీ, రవిబాబు తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: అనిల్‌ నాని, ఛాయాగ్రహణం: శివరామిరెడ్డి, కూర్పు: వేణు, సంగీతం: అర్జున్‌.

Film on Raja Shekar Reddy life

ఇక గతంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని డా.రాజశేఖర్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'రాజశేఖర రెడ్డి'అనే చిత్రం ప్లాన్ చేసారు. అయితే అనుకోని విధంగా సినిమా ఆగిపోయింది. ఆ సినమాలో 'రెడ్డి' కులానికి సంభంధించిన వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా కొన్ని సన్నివేశాలు వున్నాయనే వార్త బయటకి వచ్చింది. ఈ క్రమంలో సదురు సంఘం వారు రాజశేఖర్ తో చర్చలు జరిపి కులమతాలకు అతీతంగా సినిమా వుండాలని, కేవలం వైయస్ అంటే గౌరవభావం కలిగించే విధంగా సినిమా వుండాలని చెప్పినట్టు సమాచారం. దాంతో అప్పట్లో కాంట్రవర్శీలు అయ్యేటట్లు ఉన్నాయని పూరీ సినిమా ప్రక్కన పెట్టారని చెప్పుకున్నారు.

అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నివాళిగా 'లోకనాయకుడు" లైటిల్ తో ఒ సినిమా తెరకెక్కిస్తానని హీరో రాజశేఖర్ చెప్పారు. వైఎస్ జీవిత చరిత్ర మీద సినిమా తీస్తానని ప్రకటించిన రాజశేఖర్, అంతలోనే టైటిల్ ని కూడా ఫిక్ప్ చేసేసుకున్నాడు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ చేపట్టిన పాదమత్ర నుంచి మొత్తం ఆయన జీవిత విశేషాల్ని స్ఫురించేలా సినిమా వుంటుందని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. సబ్జెక్ట్ వర్క్ మొదలు పెట్టేశామనీ, కమర్షియల్ అంశాల్ని జొప్పించి తెరకెక్కిస్తామనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 'లోకనాయకుడు" టైటిల్ పెర్ ఫెక్ట్ గా సూటవుతుందని జీవిత, రాజశేఖర్ అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. రాజశేఖర్, జీవిత దంపతులు వైస్ ఆర్పీ పార్టీ నుంచీ బయిటకు వచ్చేసారు.

English summary
Actor Suman is acting in a movie titled 'Jai Rajasekhara' and he is playing the role of Andhra Pradesh Ex-Chief Minister,Late Rajasekhara Reddy, in the movie. Adireddy Apparao is the producer of the movie and Subbareddy has directed it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu