»   » హత్య కేసులో నిర్మాతకు సమన్లు

హత్య కేసులో నిర్మాతకు సమన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Film Producer Govardhan Murthy In Trouble Again
  బెంగళూరు : నటుడు వినోద్‌ కుమార్‌ హత్య కేసుకు సంబంధించి ఈనెల 17న విచారణకు హాజరు కావాలని నిర్మాత గోవర్ధనమూర్తికి హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో దిగువ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ వేసుకున్న అర్జీను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం వేసుకున్న మరో అర్జీను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్‌ భక్తవత్సల, జస్టిస్‌ కె.ఎన్‌.కేశవ నారాయణ కోర్టు ముందు హాజరు కావాలంటూ నోటీసుల్ని జారీ చేసింది.

  వివరాల్లోకి వెళితే... నాలుగేళ్ల క్రితం బెంగళూరుకి సమీపంలో నిర్మాత గోవర్ధనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో నటుడు వినోద్‌కుమార్‌తో కలసి మద్యం సేవించే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో వినోద్‌ హత్యకు గురయ్యారు. మూర్తి తన తుపాకీతో వినోద్‌ను కాల్చిచంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి ఇక్కడి పరప్పన అగ్రహార జైలుకు పంపారు. పలుమార్లు ఆయన వేసిన బెయిలు అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. సెషన్స్‌ కోర్టులో విచారణ చివరి దశలో గోవర్ధనమూర్తి తన తుపాకీతోనే కాల్పులు జరిపి హత్య చేసినట్లు సరైన ఆధారాల్ని సమర్పించటంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ నిందితుణ్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

  వినోద్ కుమార్ ..ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న చిన్న నటుడు. అలాగే గోవర్ధన్ రెడ్డి ఈ మద్యనే మాదేష అనే చిత్రాన్ని శివరాజకుమార్ హీరోగా నిర్మించి మంచి విజయం సాధించారు. వీరి ఉమ్మడి మిత్రుడు శంకర్ రెడ్డి అనే రియల్టర్. వీరు ముగ్గురు కలిసి గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్,సినిమా పరిశ్రమలలో పెట్టు బడులు పెడుతూ వ్యాపారం చేసేవారు.

  ఇక గోవర్ధన్ వైల్డ్ గా బిహేవ్ చేయటం ఇదే మొదటిసారి కాదు. మాదేష్ సినిమా సెన్సార్ సమయంలో ఆ సెన్సార్ మెంబర్స్ ని బెదరించటం జరిగిందని గోవర్ధన్ మార్తిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ మధ్యనే అతని ఇంటిపై ఇనకంటాక్స్ దాడి జరిగితే ఆ ఆఫీసర్స్ ని బెదిరించినట్లు కంప్లైంట్ నమోదు అయింది.

  గోవర్ధన్ మూర్తి గతంలో ఆంధ్రా క్యాబినేట్ మినిస్టర్ ని కూడా చీట్ చేసాడు . ఓ క్యాబినెట్ మినిస్టర్ చేత దాదాపు నలభై కోట్ల రూపాయలు బెంగుళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టించాడు. మూడు నెలల్లోనే రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పి డబ్బుని నొక్కేసాడు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయటం జరిగింది.

  English summary
  
 Producer Govardhan Murthy has been summoned by the High Court. It was on October 8, 2008 midnight at Bagaluru Farm House ‘Madesha’ Kannada film producer Goverdhan Murthy triggered his gun and that killed Vinodkumar. Sampige Halli police limited filed the case on the producer. Seven others names are also listed in the FIR are missing.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more