»   »  'ఢీ', 'బన్నీ' చిత్రాల నిర్మాత అరెస్టు.. చంచలగూడా జైలుకు

'ఢీ', 'బన్నీ' చిత్రాల నిర్మాత అరెస్టు.. చంచలగూడా జైలుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు విష్ణు వర్ధన్, జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ డీ చిత్రం గుర్తుండే ఉంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రాన్ని నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. అలాగే వివివినాయిక్,అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన బన్నీ, రవి తేజ,రసూల్ తో చేసిన భగీరధ చిత్రాలు కూడా ఆయనే నిర్మించారు. ఆయన్ని గురువారం అరెస్టు చేసి, చెంచలగూడా జైలుకు తరలించినట్లు సీబీఐ ఎస్పీ హెచ్‌.వెంకటేష్‌ మీడియాకు వెల్లడించారు. ఓ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో గత ఏడాది జనవరిలో దోషిగా తేలిన సత్యనారాయణరెడ్డి అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పట్టుకున్న సీబీఐ అధికారులు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష నిమిత్తం చంచల్‌ గూడ జైలుకు తరలించారని చెప్పారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన తన కుమారుడు వెంకట్ హీరోగా గీత రచయిత కులశేఖర్ దర్శకత్వంలో ప్రేమలేఖ రాసా అనే చిత్రాన్ని రెండేళ్ళ క్రితం రూపొందించారు. అయితే అదే ఆయన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో నెట్టేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయారు. దాంతో వారు కోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్ళిన ఈ కేసులో సత్యనారాయణ రెడ్డి నేరం రుజువై శిక్ష ఖరారు అయింది. అయితే ఆయన జనవరి నుంచి తప్పించుకు తిరుగుతూ లేటెస్ట్ గా పట్టుబడ్డారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X