»   » రేపు (మార్చి19)న తెలుగు సినిమా బంద్‌

రేపు (మార్చి19)న తెలుగు సినిమా బంద్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత మూడు రోజులుగా పైరసీని అరికట్టాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిర్మాత యలమంచి రవిచంద్‌కి సినీ రంగంలోని అన్ని విభాగాలూ సంఘీభావం తెలుపుతున్నాయి. అలాగే రేపు (19 తేదీన) తెలుగు చిత్ర పరిశ్రమని బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిర్ణయం ప్రకారం షూటింగ్‌లతోపాటు, చలనచిత్ర ప్రదర్శనలూ నిలిచిపోతాయి. అంతేగాక రేపు నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఓ ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి పైరసీ సమస్యపై విజ్ఞాపన అందజేస్తారని తెలియచేస్తున్నారు. ఇదంతా నిన్న(బుధవారం) సాయంత్రం హైదరాబాద్‌ లో చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నిర్ణయం. అలాగే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని కఠినతరం చేయాలని కోరడంతోపాటు పరిష్కార మార్గాల్నీ ప్రభుత్వానికి సూచించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 38 వేల వీడియో పార్లర్లు ఉన్నాయి. వాటికి లైసెన్సులు ఇవ్వాలని వారు అడగదలచుకున్నారు. అలాగే ఆ లైసెన్స్ లను చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా జారీ అయ్యేలా చూడాలని చెప్పదలుచుకున్నారు. అలా చేస్తే పైరసీపై నిఘా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే తమిళనాడు తరహాలో యాంటీపైరసీ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం ద్వారా తెలియచేస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu