twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముందే చెప్పాం.. అయినా వినలేదు.. అందుకే కూల్చేశాం...

    |

    కేరళలో సినిమా సెట్ ధ్వంసం...భగ్గుమన్న హిందు సంస్థ కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ, కొంత మంది మత పైత్యం మరింత వినాశనానికి దారితీస్తోంది. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ సినిమా కోసం వేసిన సెట్ చర్చిని పోలీ ఉండటంతో, ఓ హిందూ మత సంస్థ దాన్ని ధ్వంసం చేసింది. దీంతో సదరు సినిమా నిర్మాతకు సుమారు రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

    మళయాళీ నటుడు టోవియో థామస్ నటిస్తున్న మిన్నల్ మురళి చిత్రం కోసం, మార్చ్ లో కొచ్చి ఒట్ స్కర్ట్స్ లోని పెరియార్ నది తీరంలోని చిన్న దీవిలో ఈ సెట్ ను నిర్మించారు. అయితే ఈ సెట్ అంతా చర్చిని పోలి ఉండటంతోపాటూ, శివాలయం ఎదురుగా సెట్ ను వేయడంతో, స్థానికుల మనోభావాలు దెబ్బతింటున్న కారణంగా దాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పెరుంబవూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

    Film set worth 10 lacks destroyed Kerala

    ఈ దాడికి బాధ్యత వహిస్తూ అంతర్రాష్ట్రీయ హిందూ పరిషద్ ప్రధాన కార్యదర్శి హరి పలోడే ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ ను పెట్టారు. శివుని దేవాలయం ఎదురుగా ఈ సెట్ వేసినందుకే దాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. సెట్ వేయకముందే తాము పలు సార్లు వద్దు అని వారించినప్పటికీ, వారు వినకపోవడంతోనే ఈ పనికి పూనుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

    మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి అసాంఘిక శక్తులకు కేరళలో స్థానం లేదని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో సందేహమే లేదని ప్రకటించారు. బేసిల్ జాసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిన్నల్ మురళి చిత్రం కోసం మార్చ్ లో ఈ సెట్ ను నిర్మించగా, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి సెట్ అలాగే ఉండిపోయింది.

    English summary
    Malayalam film set destroyed by a Hindutva group in Kochi, Kerala. As the set is resembling the church and was erected oppisite the Temple, Bajrang dal members attcked and destroyed the set worth of 10 lack rupees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X