»   » ‘పాతాళ భైరవి’ లాంటి సినిమాయే ‘బహుబలి’

‘పాతాళ భైరవి’ లాంటి సినిమాయే ‘బహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ సినిమానే ఆశ్చర్యపరచి కొత్త చరిత్ర సృష్టించిన 'బాహుబలి'పై దేశంలోని ప్రఖ్యాత కథా రచయితల్లో ఒకరు, మలయాళ సినీ దర్శకుడు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ విమర్శలు కురిపించారు. అధూర్ గోపాల కృష్ణన్ పద్మశ్రీ ని అందుకున్న ఈ లెజెండ్ ఫిలిం మేకర్ పేరు తెలియని వాళ్ళు అరుదే..

ఆదూర్ గోపాలకృష్ణన్

ఆదూర్ గోపాలకృష్ణన్

1941 లో జన్మించిన ఆదూర్ గోపాలకృష్ణన్ గారు ఎనిమిదేళ్ళ అతి చిన్న వయసునుండే నాటక రంగం లోకి అడుగుపెట్టారు. తన చదువు పూర్తయే నాటికి దాదాపు 20 కి పైగా నాటకాలను రచించి దర్శకత్వం వహించారు. ఆర్ధిక మరియూ రాజనీతిఙ్ఞ శాస్త్రముల లో పట్టా పుచ్చుకున్న ఆయన అతి కొద్ది రోజులు కేరళ ప్రభుత్వొద్యోగిగా భాద్యతలు నిర్వహించి, తరువాత పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నందు చేరి 1965 లో స్క్రిప్ట్ మరియూ దర్శకత్వ శాఖలందు డిప్లొమా సంపాదించారు.


చిత్రలేఖ

చిత్రలేఖ

అదునిక భారతీయ చలనచిత్ర థృవతార అయిన ఆదూర్, చలన చిత్ర నిర్మాణ, పంపిణీ మరియూ ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శన కోసం దేశం లోనే ప్రప్రధమ సినిమా సహకార సంస్థ "చిత్రలేఖ" ని స్థాపించి కేరళ రాష్ట్ర చలనచిత్ర చైతన్యానికి మార్గదర్శకులు గా నిలిచారు.


సత్యజిత్‌రాయ్‌

సత్యజిత్‌రాయ్‌

‘ప్రజలు తమ భాషా చిత్రాలు తప్ప ఇతర భాషల్లోని చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశం గర్వించదగ్గ ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్‌రాయ్‌ను ఎవరూ బెంగాలీ దర్శకుడు అని చెప్పరని, భారతదేశ దర్శక నిర్మాతగానే పేర్కొంటారని, ఇతర భాషా చిత్రాలను ప్రాంతీయ చిత్రాలుగా పేర్కొనే అలవాటు మనలో పాతుకుపోయింది.


హిందీ కూడా దేశంలో ఓ భాష

హిందీ కూడా దేశంలో ఓ భాష

అన్నీ జాతీయ సినిమాలే. హిందీ సినిమాలనే ప్రజలు జాతీయ సినిమాలుగా భావిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. హిందీ కూడా దేశంలో ఓ భాష అంతే'' అంటూ ఆయన చేసిన కమెంట్ దేశవ్యప్తంగా చర్చకు దారితీసింది. ఈసారి ఈ లెజెండ్ బాహుబలి మీద కూడా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసారు.


గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు

గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు

ఇది మరో ‘పాతాళభైరవి' మాత్రమేనని, అంతకుమించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల ఆదూర్‌ గోపాల్‌కృష్ణన్‌ గతేడాది మలయాళ హీరో దిలీప్‌తో ‘పిన్నేయుమ్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడంలో విఫలమైనా కథారచయితగా ఆయన మార్కు నిలబెట్టుకున్నారు.


రెండింటికీ పెద్ద తేడా లేదు

రెండింటికీ పెద్ద తేడా లేదు

ఈ నేపథ్యంలో .. ఓ సందర్భాన ‘బాహుబలి' గురించి ఆయన వద్ద ప్రస్తావనకు రాగా... ‘నాకు సంబంధించిన వరకు 1951లో వచ్చిన ‘పాతాళ భైరవి' లాంటి సినిమాయే ‘బహుబలి' కూడా. రెండింటికీ పెద్ద తేడా లేదు. ఈ సినిమా చూడ్డానికి నేను 10 రూపాయలు కూడా ఖర్చుపెట్టను' అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.English summary
Legendary filmmaker Adoor Gopalakrishnan feels that S S Rajamouli's Baahubali has not contributed anything to Indian cinema. According to him, Baahubali is just another Patala Bhairavi, a Telugu fantasy film released back in 1951.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu