»   » ఐశ్వర్య రాయ్ 'ప్రొవోక్డ్‌' దర్శకుడు మృతి

ఐశ్వర్య రాయ్ 'ప్రొవోక్డ్‌' దర్శకుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐశ్వర్య రాయ్ తో 'ప్రొవోక్డ్‌' చిత్రం రూపొందించి అందరి మన్న నలు పొందిన భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్‌ దర్శకుడు జగ్‌మోహన్‌ ముంద్రా ఇక లేరు. ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 62 ఏళ్లు. 1982లో 'సురాగ్‌' సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఐఐటీ ముంబయి నుంచి ఇంజినీరింగ్‌ చదివిన ఆయన ఎమ్మెస్సీ కోసం యూఎస్‌ వెళ్లి సినిమాల మీద మోజుతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'కమల', 'నైట్‌ ఐస్‌', 'ది జగ్‌సా మర్డర్స్‌', 'ఐ విట్‌నెస్‌ టు మర్డర్‌', 'ఓపెన్‌ హౌస్‌', 'హాలోయిన్‌ నైట్‌', 'బవందర్‌', 'ప్రొవోక్డ్‌', 'షూట్‌ ఎట్‌ సైట్‌' తదితర సినిమాల్ని రూపొందించారు.

హిందీ నటుడు గోవిందాతో 'నాటీ ఎట్‌ 40' అనే రొమాంటిక్‌ సినిమాను తాజాగా తీశారు. సోనియా గాంధీ మీద ఎప్పటికైనా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నా.. కుదర్లేదు. ఆయన మృతికి షబానా అజ్మి, సీమా బిశ్వాస్‌, విక్రమ్‌ భట్‌, కబీర్‌ బేడీ, పూజా బేడీ తదితరులు సంతాపం ప్రకటించారు.ధట్స్ తెలుగు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తోంది.

English summary
Hollywood-based Indian filmmaker Jagmohan Mundhra, who made films like 'Bawandar' and 'Provoked', died Sunday, industry sources said. He was 62.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu