twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్‌ ఖాన్‌కు సినీ జన్మనిచ్చిన దర్శకుడు ఇకలేరు.. శోకసంద్రంలో బాలీవుడ్

    ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లేఖ్ టాండన్ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. టాండన్ వయసు 88 సంవత్సరాలు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అశుతోష్ గోవార

    By Rajababu
    |

    ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లేఖ్ టాండన్ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. టాండన్ వయసు 88 సంవత్సరాలు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అశుతోష్ గోవారికర్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

    ఆదివారం సాయంత్రం తుదిశ్వాస

    ఆదివారం సాయంత్రం తుదిశ్వాస

    గత ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. బీపీ, షుగర్ తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మరణించారు అని సినీ ప్రముఖుడు అశోక్ పండిట్ మీడియాకు తెలిపారు.

    అమ్రాపాలికి దర్శకత్వం

    అమ్రాపాలికి దర్శకత్వం

    బాలీవుడ్‌లో అత్యంత క్లాసికల్ మూవీ అని చెప్పుకొనే అమ్రాపాలి (1966), దుల్హన్ వహీ జో పియా మన్ భాయే (1977), తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలు నేటితరం ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని అందిస్తాయి.

    షారుక్‌లోని టాలెంట్‌ను

    షారుక్‌లోని టాలెంట్‌ను

    ప్రస్తుత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్‌లోని నటన ప్రతిభను వెతికి పట్టింది లేఖ్ టాండన్ కావడం విశేషం. షారుక్‌లోని టాలెంట్‌ను గుర్తించి 1988లో దిల్ దరియా అనే సీరియల్‌లో అవకాశం కల్పించారు.

    అశుతోష్ గోవారికర్ ట్వీట్

    వైవిధ్యమైన అభిరుచి కలిగిన దర్శకుడు లేఖ్ టాండన్. బాలీవుడ్‌కు అద్భుతమైన చిత్రాలను అందించారు. స్వదేశ్ చిత్రం సందర్భంగా మీతో పనిచేసే అవకాశం లభించడం గొప్ప విషయం. మీరు ఇక లేరనే వార్తతో చాలా బాధగా ఉన్నాం అని లగాన్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ ట్వీట్ చేశారు.

    మీకు మీరే సాటి

    వెండితెర మీద అద్భుతమైన కథను ఆవిష్కరించడంలో మీకు మీరే సాటి. మీ సలహా, సహాయం కోసం వచ్చిన వారిని ఊత్త చేతుల్తో ఎన్నడూ పంపలేదు. కనీసం టీ ఇచ్చి మర్యాద చేసేవారు. ఇక గుడ్ బై అంటూ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

    English summary
    Filmmaker Lekh Tandon passed away on Sunday evening due to multiple health issues at his residence in suburban Powai. He was 88.Tandon, who directed films like Amrapali (1966) and Dulhan Wahi Jo Piya Man Bhaaye (1977), breathed his last on October 15. Tandon is also credited with discovering actor Shah Rukh Khan by casting him in his TV serial Dil Dariya in 1988. He also directed TV serial "Farmaan", broadcast on Doordarshan in early 90s.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X