»   » రామ్ చరణ్ నిర్మాత ఆకస్మిక మృతి

రామ్ చరణ్ నిర్మాత ఆకస్మిక మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : రామ్ చరణ్ ని హిందీలో లాంచ్ చేస్తూ తుఫాన్ నిర్మించిన అమిత్ మెహ్రా ఈ రోడు ఉదయం మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు కేవలం 40 సంవత్సారాలే కావటంతో బాలీవుడ్ మొత్తం విస్తుపోయింది. చాలా మంది ఆయనకు సంతాపం తెలియచేసారు. వన్ ఇండియా తెలుగు కూడా అమిత్ మెహ్రా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గ పెట్టి జంజీర్ సినిమా ను ఆయన రీమేక్ చేసారు. తన అన్నదమ్ములతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. తన తండ్రి తీసిన లావారిస్, ముకద్దర్ కి సికందర్ చిత్రాలు సైతం ఆయన రీమేక్ చేయాలను అనుకున్నారు. అయితే ఈ లోగ ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

Filmmaker Prakash Mehra's son Amit Mehra passes away

అమిత్ మెహ్రా మృతికి ప్రియాంక చోప్రా సంతాపం తెలియచేసింది. ఆయన చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాని ఆమె అన్నారు.

1973లో వచ్చిన 'జంజీర్' చిత్రం ఒరిజినల్ వెర్షన్‌ను ప్రకాష్ మెహ్రా 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్ పై నిర్మించారు. అతని పెద్ద కుమారుడైన అమిత్ మెహ్రాకు సంబంధించిన అడయ్ మెహ్రా ప్రొడక్షన్స్ ప్రై.లి రామ్ చరణ్ హీరోగా జంజీర్ చిత్రాన్ని రీమేక్ చేసింది. దీంతో అమిత్ సోదరులైన సుమీత్, పునీత్ రంగంలోకి దిగారు.

తమ అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేసారని, తమ తండ్రిగారు నిర్మించిన ఆ సినిమాపై తమకూ హక్కులు ఉన్నాయని కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో అమిత్ వారిద్దరికి తగిన మొత్తం చెల్లించడంలో విఫలం అయ్యారు. చివరకు జరిగిన సెటిల్మెంట్‌లో ఈ చిత్రం హక్కులు సుమీత్, పునీత్‌లు దక్కించుకున్నారు. త్వరలో వీరే రామ్ చరణ్ నటించిన జంజీర్ చిత్రాన్ని 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్‌పై, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా విడుదల చేసారు.

English summary
Amit Mehra, son of producer-director Prakash Mehra died today morning after suffering a cardiac attack. He was 40.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu