»   »  ఇది ప్రభుత్వం చేసే మోసంకాదా? డ్రగ్స్ ని చట్టబద్దం చేయండి: రామ్‌గోపాల్ వర్మ

ఇది ప్రభుత్వం చేసే మోసంకాదా? డ్రగ్స్ ని చట్టబద్దం చేయండి: రామ్‌గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన డ్ర‌గ్స్ కేసులో ఒక పక్క విచారణ జరుగుతూంటే ప్రతీ విషయంలోనూ తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. ఈ వివాదాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విరుచుకు పడ్డాడు.

తెలంగాణా ప్రతిష్టకే భంగం

తెలంగాణా ప్రతిష్టకే భంగం

డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందంటూ మాట్లాడి ఇప్పటికే విమర్శల పాలైన వర్మ ఇంకా తన పద్దతి మాత్రం వీడలేదు. అదే దారిలో తన మానాన తాను మాట్లాడుతూ పోతూనే ఉన్నాడు.

Puri Jagannadh And Ravi Teja facing problems with drugs issue
హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం

హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం

పూరీ జగన్నాధ్ సహా సినిమా వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విచారణపై వర్మ మండిపడుతూనే ఉన్నాడు. విచారణ అంటూనే లేనిపోని లీకులను బయటకు ఇస్తుండటాన్ని వర్మ ఖండించాడు.పంజాబ్ స్కూల్స్‌లో జరుగుతున్నట్లుగానే తెలంగాణ, హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని ముంబై వాసులు భావిస్తున్నారని అన్నాడు.

కేసీఆర్‌కున్న మంచి పేరును చెడగొట్టేలా

కేసీఆర్‌కున్న మంచి పేరును చెడగొట్టేలా

డ్రగ్స్ కేసు విచారిస్తున్న సిట్.. హైదరాబాద్, టీఆర్ఎస్, కేసీఆర్‌కున్న మంచి పేరును చెడగొట్టేలా వ్యవహరించవద్దని వర్మ చెప్పగానే ఆయన టీవీ 9 ఇంటర్వ్యూని సమర్థించిన వాల్లే ఈ విషయం లో వర్మని సమర్థించలేక పోయారు. అయినా వర్మ ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని వర్మ తప్పుపట్టాడు.

చట్టబద్ధం చేస్తే తప్పేంటి?

చట్టబద్ధం చేస్తే తప్పేంటి?

సిగరెట్‌, ఆల్కహాల్‌లాగానే డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేస్తే తప్పేంటి అని సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. ‘కేవలం ఆదాయం కోసమే సిగరెట్‌, ఆల్కహాల్‌లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం డ్రగ్స్‌ను మాత్రం చట్టవిరుద్ధంగా ఎందుకు చూస్తోంది. డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేయవచ్చు కదా

ప్రభుత్వం చేసే మోసం కాదా

ప్రభుత్వం చేసే మోసం కాదా

అలాచేస్తే ఎక్సైజ్‌ శాఖ ద్వారా ప్రభుత్తానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా! నిజానికి ఆల్కహాల్‌ను సప్లై చేస్తూ ప్రజలను తాగుబోతులుగా మార్చి వారి ఆరోగ్యాలను చెడగొడుతోంది ఎక్సైజ్‌ శాఖే. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆల్కహాల్‌ను అనుమతించడం మోసం కాదా' అని వర్మ ప్రశ్నించారు.

English summary
If government's only reason to allow smoking and alcohol use is to earn more income through taxes why not legalize drugs too like they did with alcohol and smoking so that then the excise department can make bigger profit for the government than the present. says Varma
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu