»   » శ్రీదేవి ట్విట్టర్‌లో బోని కపూర్ ఎమోషనల్ ట్వీట్..అర్జున్ కపూర్, అన్షులా పిల్లర్లుగా నిలిచారు!

శ్రీదేవి ట్విట్టర్‌లో బోని కపూర్ ఎమోషనల్ ట్వీట్..అర్జున్ కపూర్, అన్షులా పిల్లర్లుగా నిలిచారు!

Subscribe to Filmibeat Telugu
Boney Kapoor Finally Responds On Sridevi's Loss

అతిలోక సుందరి శ్రీదేవి సినీ అభిమానుల గుండెల్లో అందమైన చరిత్రగా మిగిలిపోయింది. బుధవారం లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల నడుమ శ్రీదేవి అంత్య క్రియలు పూర్తయ్యాయి. శ్రీదేవి దుబాయ్ లో బాత్ టబ్ లో మరణించారనేది మాత్రమే అందరికి తెలిసిన విషయం. కానీ బాత్ టబ్ లో ఎలామరణించారు, అక్కడ జరిగిన సంఘటన ఏంటి వంటి విషయాలు రహస్యంగా మిగిలిపోయాయనేది కొందరి వాదన. ఏది ఏమైనా శ్రీదేవి మరణం తరువాత ఆమె భర్త బోనికపూర్ తొలిసారి స్పందించారు. అదికూడా శ్రీదేవి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లోకి దూరి మరీ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.

కాలగర్భంలో కలిసిపోయే రహస్యమేనా

కాలగర్భంలో కలిసిపోయే రహస్యమేనా

పలువురు సినీతారలు, సెలెబ్రిటీలు ప్రముఖుల మరణాలు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. అదే జాబితాలో శ్రీదేవి మరణం కూడా చేరిపోయింది కొందరు అభిప్రాయ పడుతున్నారు. బాత్ టబ్ లో మరణించిందనే విషయం తప్ప శ్రీదేవి ఎలా మరణించిందని విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సైతం నిర్ధారించలేదు.

దుబాయ్‌లో జరిగింది హైడ్రామానేనా

దుబాయ్‌లో జరిగింది హైడ్రామానేనా

శ్రీదేవి మృతిపై దుబాయ్ లో పెద్ద హైడ్రామానే సాగింది. పోలీస్ ల ఎంక్వైరీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ అంటూ పలు వార్తలు మీడియా సంస్థల్లో హల్ చల్ చేసాయి. వాటిలో నిజం లేకపోతే శ్రీదేవి మరణం గురించి అన్నిరకాలుగా వార్తలు ఎలా పుట్టుకొస్తాయని వాదించేవారు లేకపోలేదు.

సాఫీగా అతిలోక సుందరి అంత్యక్రియలు

సాఫీగా అతిలోక సుందరి అంత్యక్రియలు

లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య శ్రీదేవి అంతిమ యాత్ర సాఫీగా జరిగింది. దుబాయ్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి చివరి మజిలీ సాఫీగా జరుగుతుందా అనే అనుమానాలు సగటు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. ఎట్టకేలకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆందోళన వైదొలిగి, అభిమానులు ఆమెని కడసారి చూసుకునే అవకాశం కలిగింది.

శ్రీదేవి ట్విట్టర్‌లో ఎమోషనల్ గా బోని

అప్పటివరకు శ్రీదేవి మరణంపై మౌనం వహించిన బోని కపూర్, అంత్యక్రియల అనంతరం స్పందించారు. శ్రీదేవి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆయన ఎమోషనల్ గా ఓ ప్రకటన విడుదల చేసారు.

వర్ణనాతీతమైన బాధ

వర్ణనాతీతమైన బాధ

స్నేహితురాలి లాంటి భార్యని, ఇద్దరు యుక్తవయస్సులో ఉన్నకుమార్తెల తల్లిని కోల్పోవడం వర్ణనాతీతమైన బాధ అని బోనికపూర్ అన్నారు.

వారందరికీ రుణపడి ఉంటా

వారందరికీ రుణపడి ఉంటా

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నా కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు మరియు శ్రీదేవి కోట్లాది మంది అభిమానులు అండగా నిలిచారని బోనికపూర్ అన్నారు. వారందరికీ తాను రుణపడి ఉంటానని బోనికపూర్ తెలిపారు.

అర్జున్, అన్షులా పిల్లర్లుగా

అర్జున్, అన్షులా పిల్లర్లుగా


బోనికపూర్ ఈ ప్రకటనలో తన కుమారుడు అర్జున్ కపూర్ మరియు కుమార్తె అన్షులా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో వారిద్దరూ తనకు, జాన్వీ మరియు ఖుషికి అండగా నిలిచినా విధానాన్ని ఆయన మెచ్చుకున్నారు. అర్జున్, అన్షులా తమని ఓదార్చడంలో బలమైన పిల్లర్లుగా మారారని అన్నారు.

కుటుంబం అంతా కలసి

కుటుంబం అంతా కలసి

అర్జున్ కపూర్, అన్షులా కలిపి ప్రస్తావిస్తూ తామంతా కుటుంబంగా శ్రీదేవి మరణ దుఃఖాన్ని, ఈ కష్టాన్ని అధికమించడానికి ప్రయత్నించామని బోనికపూర్ అన్నారు.

రక్షణ కవచాన్ని కోల్పోయాం

రక్షణ కవచాన్ని కోల్పోయాం

ఈ ప్రపంచానికి, తన అభిమానులకు శ్రీదేవి ఎప్పటికి వారి చాందినిగా గుర్తుంటుంది. కానీ నాకు ఆమె జీవిత భాగస్వామి, ప్రియమైన భార్య. నా ఇద్దరు పిల్లకు జాన్వీ, ఖుషికి వారి తల్లే సర్వం అని బోనికపూర్ అన్నారు. తన కుటుంబానికి రక్షణ కవచం లాంటి తన భార్యని కోల్పోయాం అని ఎమోషనల్ గా బోని ప్రస్తావించారు.

ఎమోషనల్ అప్పీల్

ఎమోషనల్ అప్పీల్

ఇలాంటి సమయంలో తమకు ప్రైవసీ కల్పించాలని బోనికపూర్ కోరారు. శ్రీదేవి జ్ఞాపకాల గురించి మాట్లాడాలని, ఊహాగానాలకు స్వస్తి చెప్పాలని బోనికపూర్ పరోక్షంగా ప్రస్తావించారు.

వారిపైనే నా దృష్టంతా

వారిపైనే నా దృష్టంతా

శ్రీదేవి దూరమైన ఈ పరిస్థితుల్లో తాను జాన్వీ, ఖుషి భవిషత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని బోనికపూర్ అన్నారు. శ్రీదేవి లేని ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారి జీవితానికి ఓ దారి చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని బోనికపూర్ తన ప్రకటనని ముగించారు.

English summary
Finally Boney Kapoor responds after Sridevi death. He made emotional appeal in Sridevi Twitter account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu