»   » ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మను దేవుడు జయించాడు (ఫోటో)

ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మను దేవుడు జయించాడు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. తాను అసలు దేవుడినే నమ్మును అంటాడు. తానెప్పుడూ దేవుడిని ప్రార్థించను అని వాదిస్తుంటాడు. అయితే రామ్ గోపాల్ వర్మ తన తాజా సినిమా ‘అటాక్' సినిమా సెట్లో వినాయకుడికి ప్రార్థించడాన్ని హీరో మంచు మనోజ్ తన కెమెరాలో బంధించాడు. ఎట్టకేలకు వర్మ మీద దేవుడు విజయం సాధించాడు అంటూ వ్యాఖ్యానించారు.

Finally god wins over RGV :) at #Attack set

Posted by Manchu Manoj on Thursday, September 3, 2015

అటాక్ సినిమా విషయానికొస్తే...
మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం "ఎటాక్". ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇదే.

జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది.

Finally god wins over RGV

ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.

మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో కరెంట్ తీగ చిత్రం వచ్చింది. ఇప్పుడీ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
"Finally god wins over RGV at ‎Attack‬ set" Manchu Manoj said.
Please Wait while comments are loading...