»   » ఫైనల్ గా : నయనతారకు నో... అంజలి కే ఆఫర్

ఫైనల్ గా : నయనతారకు నో... అంజలి కే ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'డిక్టేటర్‌' అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్ గా ఎంపికైంది. బాలకృష్ణ సరసన అంజలి నటించడం ఇదే తొలిసారి. ఈ నెల 29న లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభిస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ చిత్రంలో నయనతార ని హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఖరారు అయినట్లు ఎవరూ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగ అందిన సమాచారం ప్రకారం..అంజలినే ఓకే చేసి, ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. నయనతార రెమ్యునేషన్ ఎక్కువ అడగటంతో అంజలి వైపు మ్రొగ్గు చూపినట్లు సమాచారం.

Finally, it's Anjali for Balayya

బాలకృష్ణ మాట్లాడుతూ ''కొత్తదనం నిండిన కథ ఇది. శ్రీవాస్‌ పక్కా స్క్రిప్టుతో నా దగ్గరకు వచ్చారు. ఎరోస్‌ సంస్థతో పనిచేయడం ఆనందంగా ఉంది. నా 99వ సినిమా డిక్టేటర్ ని ఈ నెల 29న ప్రారంభించబోతున్నాం. కథ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. ఈ మధ్యే ఈరోస్ ప్రతినిధి సునీల్ లుల్లా, డైరెక్టర్ శ్రీవాస్ కలిసి మాట్లాడుకున్నాం. కోన వెంకట్, గోపీ మోహన్ అన్ని ఎలివెంట్స్ ఉన్న మంచి కథ అందించారు. రత్నం, శ్రీధర్ సీపానలు కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమాకు ఒక ఫ్రెష్ టీంతో కలిసి పని చేస్తున్నాను. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్టెన్మెంట్ అన్ని ఎలిమెంట్స్ తో యూనిక్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది' అన్నారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ ఎండి సునీల్ లుల్లా మాట్లాడుతూ...బాలకృష్ణ, శ్రీవాస్ కాంబినేషన్లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. శ్రీవాస్ చెప్పిన కథ బాగా నచ్చింది. శ్రీవాస్ డైరెక్షన్ చేయడంతో పాటు ఈ సినిమాకి కో ప్రొడ్యూస్ చేయడం వల్ల సినిమా పక్కా ప్లానింగుతో సాగుతుంది. సినిమాను గ్రాండ్ లెవల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తాం. శ్రీవాస్ అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకుంటారు. ఈ సినిమాను ఈ నెల 29న లాంచ్ చేయనున్నామని తెలిపారు.

శ్రీవాస్‌ చెబుతూ ''బాలయ్యతో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. ఆ కల ఇలా తీరింది. ఈ చిత్రంతో నన్ను నిర్మాతని కూడా చేశారు బాలయ్య. ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో.. అలానే తెరపై చూపిస్తాం. నందమూరి అభిమానులకు ఇది వినోదాల విందే'' అన్నారు.

Finally, it's Anjali for Balayya

అలాగే...ఈరోస్ సంస్థ సౌత్ లో ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమా ఇదే. ఆ సంస్థతో మా వేధాశ్వ క్రియేషన్స్ బ్యానర్ తో నేను కోప్రొడ్యూసర్ గా పార్ట్ కావడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. బాలయ్య సపోర్టుతో నిర్మాతగా మారాను. బాలయ్య బాబును ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని విధంగా డిఫరెంటుగా ప్రజెంట్ చేస్తున్నాము అన్నారు.

బాలకృష్ణ సరసన తొలిసారి చేస్తూండటంతో అంజలి చాలా హ్యాపీగా ఫీలవుతోంది. నాజర్‌, బ్రహ్మానందం, రవికిషన్‌, వెన్నెల కిషోర్‌, సుప్రీత్‌ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే : కోనవెంకట్‌, మాటలు: ఎం.రత్నం, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: తమన్‌

English summary
Anjali has been confirmed as Balayya's heroine for the 99th. It is already confirmed that Sriwass will direct this powerful film, besides producing it in joint collaboration with Eros.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu