»   » ఆయనకు నా డార్క్ సీక్రెట్స్ కూడా చెప్పుకున్నా, అలాగని లివ్ ఇన్ రిలేషన్ షిప్ లేను

ఆయనకు నా డార్క్ సీక్రెట్స్ కూడా చెప్పుకున్నా, అలాగని లివ్ ఇన్ రిలేషన్ షిప్ లేను

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కొచ్చి:గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న మలయాళ హీరోయిన్ కావ్యా మాధవన్, హీరో దిలీప్ జంటను మాలీవుడ్ మురిపెంగా 'లివింగ్ లైలా మజ్ను'గా పిలుచుకునేది. రీసెంట్ గా(నవంబర్ 25న) ఈ జంట కొచ్చిలోని ఓ హోటల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా సాగింది.

  అయితే, వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే. 1998లో హీరోయిన్ మంజూ వారియర్ ను పెళ్లి చేసుకున్న దిలీప్ ఆమెకు విడాకులిచ్చాడు.ఇక తన కెరీర్ జోర్ మీద ఉన్న టైమ్ లో 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న కావ్య ఏడాదిలోపే అతనికి విడాకులిచ్చింది. ఆ తర్వాత కావ్య, దిలీప్ ప్రేమలో ఉన్నారని ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అలాగే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా చెప్పుకున్నారు.

  ట్రెండింగ్ ఇదే వీడియో ‌: హీరో,హీరోయిన్స్ కదా ఆ మాత్రం క్రేజ్,హానీమూన్ కు

  ఇక ఈ పెళ్లి విషయమై స్టార్ అండ్ స్టైల్ అనే మళయాళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో దిలీప్ ను ఎందుకు పెళ్లి చేసుకుందో కావ్య మాధవన్ వివరించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం అసలు దిలీప్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఎప్పుడూ లేదట. అయితే దిలీప్ తనకు ఇండస్ట్రీలో అత్యంత నమ్మకమైన స్నేహితుడని, ఎంత నమ్మకమైనవాడంటే తను ఎవరికీ చెప్పుకోలేని డార్క్ సీక్రెట్స్ కూడా షేర్ చేసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది.

  FINALLY! Kavya Madhavan Reveals Why She Married Dileep


  అలాగే తను దిలీప్ ని పెళ్లి చేసుకుంటానని తాను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చింది. తమ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వచ్చినప్పుటికి ఎప్పుడూ సీరియల్ గా తీసుకోలేదని అంది. ఆమె తన జీవితం లో తనకు సరిపడే పార్టనర్ అన్వేషణ దిలీప్ తో పూర్తైంది అని చెప్పింది.

  అంతేకాదు తమ జాతకాలను ఓ జ్యోతిష్యుడుకి చూపెట్టామని, తామిద్దరం ఒకరికోసమే మరొకరు పుట్టామని చెప్పాడని, తమ వైవాహిక జీవితం అద్బుతంగా సాగుతుందని చెప్పాడని చెప్పుకొచ్చింది. వెంటనే మరుసటి రోజే తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. ఈ జంట ఇప్పటిదాకా 21 సినిమాల్లో కలిసి నటించగా.. అందులో ఎన్నో సూపర్ హిట్టయ్యాయి.

  English summary
  Kavya Madhavan and Dileep, one of the most-celebrated on-screen pairs of Mollywood, entered the wedlock on November 25. In the recent interview given to Star N Style magazine, Kavya finally revealed why she married Dileep. According to the actress, she was never in a relationship with the actor. Dileep was one of the closest industry friends of Kavya, with whom she could share even the darkest secrets.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more