»   »  హీరోయిన్ పై ప్రాడ్ కేస్...క్రైం బ్రాంచ్ విచారణ

హీరోయిన్ పై ప్రాడ్ కేస్...క్రైం బ్రాంచ్ విచారణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Roma Asrani
మళయాళ హీరోయిన్ రోమా,డైరక్టర్ మేజర్ రవి లను ఓ ఛీటింగ్ కేసు నిమిత్తం కేరళ క్రైమ్ బ్రాంచ్ వారిద్దరినీ ప్రశ్నించింది. కొచ్చిలో ఈ జరిగిన ఈ సంఘటన కేరళ పరిశ్రమను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. వీళ్ళిద్దరూ ఈ మధ్యన కాంట్రావర్శిగా మారిన శబరీనాధ్ ఫైనాన్సియల్ ఫ్రాడ్ కేసుతో సంభందం ఉందని తెలియటంతో క్రైం బ్రాంచ్ ఎలర్టయి ఈ పని చేసారని అక్కడ పత్రికలు రాస్తున్నాయి. వడ్డీ వేసి పెద్ద పెద్ద మొత్తాలు ఇస్తానని ప్రజల దగ్గరనుండి డిపాజిట్లు సేకరించి తర్వాత బిచాణం ఎత్తేసిన ఫేనాన్సియల్ క్రైమ్ లో శబరీనాధ్ ముఖ్యుడు.

రోమా ప్రస్తుంతం షఫి దర్శకత్వం వహిస్తున్న లాలీపాప్ అనే సినిమా షూటింగ్ లో ఉండగా ఈ క్రైం బ్రాంచ్ విచారణ చోటు చేసుకుంది. క్రైమ్ బ్రాంచ్ వారు చెప్పే దాని ప్రకారం ఆమె శబరీనాధ్ సొంత మ్యూజిక్ కంపెనీ రూపొందించిన 'Malayali' ఆల్బమ్ కి నిమిత్తం ఆమె కమిటయ్యింది. అంతేగాక ఆమె శబరీనాద్ ఏర్పాటుచేసిన ఓ పంక్షన్ కి సైతం అటెండయ్యింది. రెమ్యునేషన్ గా బంగారు ఆభరణాలు తీసుకుంది. శబరీనాధ్ సంస్ధల్లో పెట్టుబడి పెట్టిందని.

దీనికి రోమా సమాధానమిస్తూ నేను శబరీనాధ్ కంపెనీ చేస్తున్న ఆల్బమ్ నిమిత్తం రెండు గంటలు పనిచేసాను. వారు ఒక లక్ష రూపాయలు మాత్రమే పే చేసారు. అలాగే శబరీనాధ్ ఏర్పాటు చేసిన బిజెనెస్ ప్రమేషనల్ పోగ్రామ్స్ లో వృత్తి పరంగానే పాలు పంచుకున్నాను. వారు కొద్ది నామినల్ ఎమౌంట్ మాత్రమే ఇచ్చారు. అంతేకాని బంగారు ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటోంది.

అంతేగాక తనకీ శబరీనాధ్ కి పర్శనల్ గా గానీ,ఫైనాన్సియల్ గా గానీ సంభందాలు లేవనీ.. అంతేగాక అతని కంపెనీలో ఇన్వెస్ట్ చేసిననటం నిరాధారమైన నింద అని వివరిస్తోంది. అలాగే దర్శకుడు మేజర్ రవి తన సినిమా కురుక్షేత్ర నిమిత్తం ఏ విధమైన ఫైనాన్స్ అతని వద్దనుండి తీసుకోలేదని చెప్పారు. అయితే క్రైం బ్రాంచ్ వారు ఇన్వెస్ట్ గేషన్ అంతా అయిపోయాక తాము మీడియా లో వచ్చిన వార్తలు ఆధారంగా క్రాస్ చెక్ చేయాల్సి వచ్చిందనీ చెప్పటం కొస మెరుపు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X