»   » సినిమా ఫ్లాఫ్ ఎఫెక్టు : హీరోయిన్ కోటి రూపాయలు మోసం

సినిమా ఫ్లాఫ్ ఎఫెక్టు : హీరోయిన్ కోటి రూపాయలు మోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ఓ సినిమా ఫెయిల్యూర్ అయ్యిందంటే దానికి రకరకాల సమస్యలు వచ్చి చుట్టుముడతాయి. ముఖ్యంగా ఫెయిల్యూర్ చిత్రాలకు ఆర్దిక వివాదాలు నిరంతంర తోడుంటాయి. అలాంటి సంఘటన ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో చోటు చేకుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లోకి ఎక్కే కన్నడ నటి పూజాగాంధీ. ఆమె తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పూజాగాంధీ కోటి రూపాయలు డబ్బు తీసుకుని మోసానికి కు పాల్పడినట్లు, నటుడు డాక్టర్ సురేశ్ శర్మ వాణిజ్యమండలికి ఫిర్యాదు చేశారు.

ఆ మధ్యన పూజా గాంధీ ప్రధాన పాత్రలో చేసిన అభినేత్రి సినిమా కోసం పూజాగాంధీ కోటి రూపాయలు నగదు తీసుకున్నదని , ఆ నగదు తిరిగి ఇప్పించాలని సురేష్ శర్మ కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండిలికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె మోసం చేసినట్లు చూపే ఆధారాలను ఏవీ ఆయన సబ్ మిట్ చేయలేదు.

దాంతో నగదు తీసుకున్నప్పుడు పూజాగాంధీ నుంచి ఏమైనా చట్టపరమైన ఆధారాలు తీసుకుని ఉండాల్సిందని వాణిజ్యమండలి సెక్రటరీ వ్యాఖ్యానించారు. ఈ పిర్యాదుపై పూజా గాంధీతో చర్చిస్తామని తెలిపారు. అయితే ఇప్పటివరకూ పూజా గాంధీ ఈ విషయమై స్పందించలేదు.

Financier Suresh Sharma files Complaint against Pooja

కన్నడలో తిప్పాజీ సర్కిల్ అనే సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో పూజా గాంధీ తిప్పాజీ పాత్రలో నటించింది. ఆమె భర్తగా సురేష్ శర్మ నటించారు. అప్పటి నుండి ఇద్దరు స్నేహితులు అయ్యారు. తరువాత పూజా గాంధీ సొంతంగా అభినేత్రి అనే సినిమా నిర్మించారు.

ఒక నటి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రానికి పూజా గాంధీ నిర్మాత. అభినేత్రి పాత్రలో ఆమె నటించారు. అభినేత్రి సినిమా పోస్టు ప్రొడక్షన్ సమయంలో తన దగ్గర పూజా గాంధీ రూ. ఒక కోటి తీసుకున్నదని, గడువు పూర్తి అయినా తిరిగి ఇవ్వలేదని సురేష్ శర్మ ఫిర్యాదు చేశారు.

అయితే తను ఎవ్వరి దగ్గర రుణం తీసుకుకోలేదని, అలా తీసుకుని ఉంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా అని పూజా గాంధీ ప్రశ్నిస్తున్నారు. సురేష్ శర్మ దగ్గర ఎదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని పూజా గాంధీ సవాలు చేస్తున్నారు.

వెండితెరపై ఒక్కవెలుగు వెలిగి పరిస్థితుల ప్రభావంతో దుర్భర జీవితం సాగించిన హీరోయిన్స్ జీవితాల కథాంశంతో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషించిది. కట్టుబొట్టు అలనాటి నటి కల్పనను పోలిఉన్నా ఆమె జీవితానికి అభినేత్రి సినిమాకు సంబంధం లేదని పూజా స్పష్టం చేశారు.

ఏడో దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో కథాగమనం ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరణను కొనసాగించేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని తెలిపారు. రంగస్థలం నేపథ్యం కోసం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిత్రీకరణను పూర్తి చేశారు. అభినేత్రిలో అభినయం సవాల్‌గా తీసుకుని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది.

English summary
Producer, Actor cum Financier Suresh Sharma has filed a complaint against Actress Pooja Gandhi in KFCC for not returning 1 Crore rupees loan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu