»   » హీరో రవితేజకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా

హీరో రవితేజకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సెలబ్రెటీలందరకీ వరసపెట్టి ఫైన్ లు ట్రాఫిక్ పోలీసులు వేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేస్తుండగా సినీ నటుడు రవితేజ బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులో వచ్చారు. పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి, ఆ ఫిల్మ్ పెట్టినందుకు రూ.800 జరిమానా విధించారు.

ఇక రవితేజ తాజా చిత్రాల విషయానికి వస్తే.. క్రేజీ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్‌తో మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దిల్‌రాజు, వేణుశ్రీరామ్‌ల ఎవడోఒకడు, సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం,

Fine Imposed By Police On Ravi Teja

దాంతోపాటు నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లామర్‌భామ అమీజాక్సన్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

దీంతోపాటు ఈ చిత్రానికి రాబిన్‌హుడ్ అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం. ఇటీవలే ఈ ఛాంబర్‌ని రంజిత్ మూవీస్ ఫిలిమ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారట. ఇప్పటికే రవితేజ నటించిన కిక్-2 సినిమాలో రాబిన్‌హుడ్ పాత్రలో ఆయన నటించాడు. ఇప్పుడు ఈ సినిమాకు రాబిన్‌హుడ్ టైటిల్ పెడుతుండడంపై అంతటా ఆసక్తి నెలకొంది. త్వరలోనే అధికారికంగాటైటిల్‌ను వెల్లడిస్తారట.

మరో ప్రక్క అనీల్ రావిపూడి తాజా చిత్రం సుప్రీమ్ హిట్టయ్యాక పోన్ చేసి.... 'మంచి కథ ఉంటే చెప్పు.. కలసి చేద్దాం' అని అన్నారు. దాంతో ప్రస్తుతం అనిల్‌రావిపూడి ఇప్పుడు రవితేజ కోసం కథ వండే ప్రయత్నంలో ఉన్నాడని వినికిడి. మరో ప్రక్క రవితేజ ప్రస్తుతం చక్రి అనే నూతన దర్శకుడితో కలసి ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆ తరవాత అనిల్‌ సినిమా ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Ravi Teja has been charged a fine of 800 rupees today. The traffic police officers at Jubilee Hills found that Ravi Teja was travelling in a car, which has black films for the window glasses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu