»   » ఆన్ లైన్ మోసం: రణబీర్ కపూర్ పై కేసు నమోదు

ఆన్ లైన్ మోసం: రణబీర్ కపూర్ పై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌, నటుడు-దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌లపై కేసులు నమోదయ్యాయి. 'ఆస్క్‌ మి బజార్‌' అనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ కోసం వినియోగదారులను మోసం చేసేలా ప్రకటనలు ఇచ్చారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని కేశవ్‌నగర్‌కు చెందిన రజత్‌ బన్సాల్‌ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. కేశవ్‌నగర్‌లోని మదియాన్‌ పోలీసు స్టేషన్‌లో సెప్టెంబరు 19వ తేదీన రణబీర్‌, అక్తర్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

వీరితో పాటు ఆస్క్‌మిబజార్‌.కామ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ డైరెక్టర్లు సంజీవ్‌ గుప్త, ఆనంద్‌ సోన్‌భద్ర, పీయూష్‌ పంకజ్‌, కిరణ్‌కుమార్‌ శ్రీనివాస్‌ మూర్తి, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పూజ గోయల్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.

FIR registered against Farhan Akhtar, Ranbir Kapoor

న్యాయవాది రాజత్‌ బన్సల్‌ ఫిర్యాదులో తాను ఆగస్టు 23వ తేదీన ఆస్క్‌మిబజార్‌.కామ్‌లో 40 అంగుళాల తెర కలిగిన ఎల్‌ఈడీ టీవీ ఆర్డర్‌ చేశానని.. డెబిట్‌ కార్డు ద్వారా రూ.29,999 చెల్లించానని చెప్పారు. అయితే హామీ ఇచ్చిన విధంగా పది రోజుల లోపు తనకు టీవీ అందలేదని వెల్లడించారు.

రణ్‌బీర్‌, ఫర్హాన్‌ ప్రకటనల ద్వారా ప్రజలు మోసపోతున్నారని తెలిపారు. తర్వాత కూడా తనకు బిల్లు పంపించారని, టీవీ రాలేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రతినిధుల నుంచి ఎలాంటి సమాచారం లేదు.

English summary
An FIR has been registered against Farhan Akhtar and Ranbir Kapoor under IPC sections 406 (Punishment for criminal breach of trust) and 420 (forgery) on September 19.
Please Wait while comments are loading...