»   » షాకింగ్ : మహేష్‌ బాబు సినిమా సెట్ లో అగ్నిప్రమాదం, భారీ నష్టం

షాకింగ్ : మహేష్‌ బాబు సినిమా సెట్ లో అగ్నిప్రమాదం, భారీ నష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్‌బాబు నటిస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ ..రోడ్ నెంబర్ 87లో మహేష్ బాబు నటిస్తోన్న సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్ర యూనిట్‌ టెంట్లపై దీపావళి టపాసులు పడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సెట్ పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్రం విశేషాలకు వస్తే...సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కొత్త రకం కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు.

Fire accident @Mahesh-Murugudoss Shooting

ఇక ఈ షెడ్యూల్ తరువాత వేరే ప్రాంతాలలో కొన్ని క్రూషియల్ సీన్స్ తెరకెక్కించనున్నట్టు సమాచారం. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని జనవరి చివరి వారం వరకు కంప్లీట్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి 'అభిమన్యుడు' అనే టైటిల్ ని పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి.

కాని తాజాగా మహేష్ రేంజ్ కి తగ్గట్టు 'ఏజెంట్ శివ' అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనే ఆలోచనలో టీం ఉందని కోలీవుడ్ సమాచారం. అయితే మురుగదాస్ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ టైటిల్‌ని ఎనౌన్స్ చేసి చిత్రానికి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కోలీవుడ్ టాక్. దర్శకుడు ఎస్‌జె సూర్య ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోండగా, గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 28, 2017న ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

English summary
As per the latest information there happened a huge fire accident at Mahesh, Murugudoss‘s movie shooting location. The film unit reacted immediately and packed up the shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu