For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకుడు మణిరత్నం ఆఫీస్ లో అగ్నిప్రమాదం, లక్షల్లో లాస్

  By Srikanya
  |

  చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నై ఆఫీసులో సోమవారం సాయింత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మణిరత్నం నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌ కార్యాలయం అభిరామపురంలో ఉంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి మంటలు రేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పారు.

  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మణిరత్నం ఆఫీసులో కనస్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. దాంతో అనుకోని విధంగా ఈ షార్ట్ సర్క్యూట్ , అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

  సకాలంలో ప్రమాదాన్ని గుర్తించినందున పెద్ద నష్టం సంభవించలేదని చెప్తున్నారు. అయితే లక్షల విలువైన కమిడెటీస్ మాత్రం బూడిద అయ్యాయని తెలుస్తోంది. ఎవరి ప్రాణాలకు నష్టం అయితే రాలేదని చెప్తున్నారు.

  ప్రస్తుతం మణిరత్నం కార్తి హీరోగా 'కాట్రు వెలియిడై' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తనదైన మేకింగ్‌, ఫ్రేములు, మాటలు, మనసును హత్తుకుపోయే కథలతో వచ్చే సినిమాలే.. మణిరత్నం స్పెషల్‌. రోజా, ముంబై, సఖి వంటి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ స్థాయిలో రంజింపజేసే సినిమా ఇటీవల రాలేదనే ఆవేదన మణి అభిమానుల్లో ఉంది.

  రావణన్‌, కడల్‌ సినిమాలు ఆశించిన రేంజ్‌లో ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఆ కొరతను ఓకే బంగారం సినిమాతో సరిదిద్దారు. ఇదిలా ఉండగా మణిరత్నం తదుపరి చిత్రంపై అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

  ఇందులో బాలీవుడ్‌ నటి అతిథిరావు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్‌జే బాలాజీ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. రవివర్మన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే మణిరత్నం ఆస్థాన విద్వాంసులు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

  Fire Outbreak At Mani Ratnam's Office, Director Incur Major Losses

  'కాట్రు వెలియిడై' అన్నది భారతియార్‌ రచించిన కన్నమ్మా.. గీతంలో తొలి వాఖ్యం. సినిమాలో అదే స్థాయిలో ప్రాధాన్యత కల్పించి ఉంటారని అభిమానులు నమ్ముతున్నారు. నీలగిరి ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. రెండో షెడ్యూల్‌ చెన్నైలో, మూడో షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ఉంటుందని సమాచారం.

  అలాగే కార్తీ, అదితిరావు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిల్ని ఎంపిక చేశారు. అందులో 'యు టర్న్‌' ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ ఒకరు కాగా, తాజాగా రుక్మిణి విజయకుమార్‌ను ఒక ముఖ్య పాత్రకు ఎంపిక చేశారు.

  శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం కలిగిన రుక్మిణి అమితాబ్‌, ధనుష్‌ల 'షమితాబ్‌'లో నటించింది. 'కాట్రు వెలియిడై' చిత్రంలో అవకాశం దక్కడంతో రుక్మిణి ఆనందంలో మునిగితేలుతోంది. 'మణి సార్‌ దర్శకత్వంలో నటించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను' అని రుక్మిణి తెలిపింది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది.

  English summary
  A fire outbreak at Mani Ratnam's office in Chennai has caused panic in the neighbourhood. Though no casualties were reported, commodities worth Lakhs of rupees were burnt to ashes, according to reports.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X