»   » ‘2 స్టేట్స్...వన్ లవ్’ మూవీ ఫస్ట్ లుక్

‘2 స్టేట్స్...వన్ లవ్’ మూవీ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: త్వరలో మనం థియేటర్లోకి '2 స్టేట్స్' అనే చిత్రం వస్తోంది. 'వన్ లవ్' అనేది సబ్ టైటిల్. కొంపతీసి ఇదేదో తెలంగాణ, సీమాంధ్ర అంశాలకు సంబంధించిన సినిమా అని మాత్రం ఊహించుకోవద్దు. ఇదొక బాలీవుడ్ మూవీ. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్నారు.

యూటీవీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో సాజిద్ నడియావాలా, కరణ్ జోహార ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. రొమాంటిక్ డ్రామా నేపత్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2009లో చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈచిత్రాన్ని రూపొందించారు.

First Look Of 2 States

ఉత్తర, దక్షిణ భారత దేశంలోని రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కొన్ని సంప్రదాయాలపై సెటైరిక్‌‍గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అలియా భట్ తమిళ బ్రాహ్మణ యువతిగా కనిపించబోతోంది. అర్జున్ కపూర్ పంజాబీ యువకుడిగా కనిపించనున్నాడు. రెండు విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, ప్రాంతాల నుండి వచ్చిన వీరి మధ్య జరిగే స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది.

ఏప్రిల్ 18, 2014న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అర్జున్ కపూర్, అలియా భట్‌తో పాటుగా....అమృత సింగ్, రేవతి, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎస్సాన్-లాయ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Alia Bhatt must be on cloud nine for the positive and encouraging response her latest release Highway, directed by Imtiaz Ali, is getting. Now the poster of her upcoming film 2 States is also launched to great fanfare.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu