»   » బాజిరావు మస్తానీ : దీపిక పదుకోన్ లుక్ అదుర్స్ (ఫోటోస్)

బాజిరావు మస్తానీ : దీపిక పదుకోన్ లుక్ అదుర్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణం తొలిరూపులను చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది.

బాజీ రావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.... అతని ప్రియురాలు మస్తానీ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తోంది. బాజీరావ్‌ భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాలోని ‘దీవాని మస్తానీ' అనే సాంగులో దీపిక పదుకోన్ లుక్ అదిరిపోనుంది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మస్తానీ లుక్ విడుదల చేసారు. డిసెంబర్ 18న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

First look: Deepika Padukone in 'Bajirao Mastani'

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్‌ కొత్తగా కనిపిస్తున్నారు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. బాజీరావ్‌ ప్రేయసి మస్తానీగా నటిస్తున్న దీపికా పదుకోన్ చేతిలో విల్లుతో వీరనారిలా సినిమాలో కొన్ని సీన్లలో కనిపించబోతోంది.

English summary
Eros International and Bhansali Productions have released the first look Deepika Padukone as princess Mastani from Sanjay Leela Bhansali's magnum opus 'Bajirao Mastani.'
Please Wait while comments are loading...