Just In
- 5 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 23 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- News
కాస్మిక్ గర్ల్: పీఎస్ఎల్వీలు కాదు.. విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం: ఒకేసారి తొమ్మిది
- Automobiles
ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ సంవత్సరం ‘ధూమ్-3’తో అంతం (ఫస్ట్ లుక్)
హైదరాబాద్ : అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రం ఫస్ట్ లుక్ ఎట్టకేలకు ఈరోజు (ఆగస్టు 13)న విడుదలైంది. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం.
ఈసంవత్సరం ధూమ్-3తో అంతం అవుతుంది అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అంటే ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.
ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

అమీర్ ఖాన్
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని అమీర్ ఖాన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ 25 విడుదల చేయడం అంటే చాలా దూరం ఉన్నట్లుగా అనిపిస్తోందని అమీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తున్నాడు.

మనసు ఒప్పుకోవడం లేదట
సినిమాను అంత లేటుగా విడుదల చేయడం అమీర్ ఖాన్‌కు బొత్తిగా ఇష్టం లేనట్లుంది. క్రిస్ మస్ ద్వారా వేచి చూసేందుకు మనసు ఒప్పుకోవడం లేదని సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నాడు. అన్ని మార్పులు, కూర్పులు చేసిన ధూమ్3 సినిమాను అమీర్ ఖాన్ వీక్షించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి సినిమా అద్భుతంగా వచ్చిందని స్పష్టం అవుతోంది.

కత్రినా కైఫ్ విలన్
ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి.

ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్
ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం.

ధూమ్-3
చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చెప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.