»   » ఫస్ట్ లుక్: క్రికెటర్ అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హస్మి

ఫస్ట్ లుక్: క్రికెటర్ అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హస్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఇమ్రాన్ హస్మి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకత్వం వహించనున్నారు. ‘అజర్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇందులో ఇమ్రాన్ అజారుద్దీన్ లుక్ కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేసారు. ‘ఈ సినిమా కోసం ఇమ్రాన్ చాలా కష్ట పడుతున్నాడు. అజారుద్దీన్ పాత్రను తెరపై రియల్ గా చూపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. సినిమాలో పలు ఆసక్తికర కోణాలు ఉంటాయి' అని దర్శకుడు తెలిపారు. ఇందులో అజారుద్దీన్ క్రికెట్లో వెలుగొందిన అంశాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం, రాజకీయ జీవితం లాంటి పలు ఆసక్తికర అంశాలు ఉండనున్నాయి.

 First Look: Emran Hashmi as Azharuddin

ఆ సినిమా సంగతి పక్కన పెడితే ఇమ్రాన్ హస్మి ప్రస్తుతం ‘హుమారి ఆధురి కహాని' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ భట్ నిర్మాత. కథ అందించింది కూడా ఆయనే. బాలీవుడ్లో సీరియల్ కిస్సర్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇమ్రాన్ హస్మి, విద్యాబాలన్, రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ డ్రామా. మహేష్ భట్ తల్లిదండ్రుల లవ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో అమల అక్కినేని స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు

English summary
Here's the sneak peek of actor Emraan Hashmi's look in the forthcoming film "Azhar" in which he's reprising the role of controversial cricketer and former Indian captain Mohammad Azharuddin.
Please Wait while comments are loading...