»   » ‘గుంటూరు టాకీస్’ సినిమా ఫస్ట్ లుక్ (ఫొటో)

‘గుంటూరు టాకీస్’ సినిమా ఫస్ట్ లుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారబాద్ :చందమామకథలు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు గుంటూరు టాకీస్ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు.

‘గుంటూరు టాకీస్' సినిమా పేరుతో ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు ఆ ఫస్ట్ లుక్ చూడవచ్చు.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దూ, నరేష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్‌లుగా శ్రద్ధాదాస్, జబర్దస్త్ యాంకర్ రశ్మీ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, రఘుబాబు, వెంకట్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

First look of “Guntur Talkies”

జిల్లాలో ఇతర ప్రాంతాలకు దీటుగా అందమైన లోకేషన్లు ఉన్నాయని, ఇప్పటి దాకా వీటిని సినిమాల్లో ఎవరూ ఉపయోగించుకోలేకపోయారని, అందుకే సినీ పరిశ్రమకు అనంతపురం జిల్లాను పరిచయం చేయడం కోసం ఇక్కడ షూటింగ్ నిర్వహించేలా చూసినట్లు సినీనటుడు నరేష్ తెలిపారు.

ఈ సినిమా గుంటూరు స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో ప్రవీణ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాలో 200 మంది స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు.

మానవీయ విలువల మేళవింపుతో సాగే ఈ చిత్రంలో అంతర్లీనంగా చక్కటి సందేశముంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

English summary
After the stupendous applause he received for “Chandamama Kathalu”, Praveen moved to his next project which is titled as “Guntur Talkies”. First look poster of this film’s logo design is out and it looks a painting on a wall with Savitri’s Nartanasala poster side of it.
Please Wait while comments are loading...