»   » విజయేంద్రప్రసాద్ కథతో క్రిష్ నెక్ట్స్ మూవీ ‘మణికర్ణిక’(ఫస్ట్ లుక్)

విజయేంద్రప్రసాద్ కథతో క్రిష్ నెక్ట్స్ మూవీ ‘మణికర్ణిక’(ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ మరో చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. భారత చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నాడు.

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ ఈ సినిమాలో లక్ష్మీబాయ్ గా నటించనుందన్నట్లు సమాచారం. ఈ సినిమా లక్ష్మీబాయి పుట్టినప్పటి పేరు 'మణికర్ణిక' అనే టైటిల్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ స్కెచ్

ఫస్ట్ లుక్ స్కెచ్

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్కెచ్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో కంగనా రనౌత్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నారో ఈ స్కెచ్ చూస్తే స్పష్టమవుతోంది.

విజయేంద్రప్రసాద్ కథ

విజయేంద్రప్రసాద్ కథ

బాహుబలి మూవీకి కథ అందించిన విజయేంద్రప్రసాద్.... మణికర్ణికకు కథ అందించినట్లు సమాచారం. విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే అందించనుండగా, ఓ బాలీవుడ్ రచయిత మాటలు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు బాషల్లో...

మూడు బాషల్లో...

ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

కంగనా బిజీ బిజీ

కంగనా బిజీ బిజీ

ఈ సినిమా కోసం కంగనా ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటోంది. దీంతో పాటు కత్తి యుద్ధం, ఫైట్స్ లాంటి అంశాలను నేర్చుకుంటోంది. క్రిష్ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

English summary
After doing Vishal Bharadwaj’s Rangoon alongside Saif Ali Khan and Shahid Kapoor, Kangana Ranaut will be seeing playing the role of the fierce queen Rani Laxmibhai of Jhansi. The film is titled, Manikarnika – The Queen of Jhansi after Laxmibhai’s maiden name.The film is set to be helmed by Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu