»   » పవన్ కళ్యాణ్ ‘సర్దార్’ ఫస్ట్ లుక్ ఇదే... (ఫోటో)

పవన్ కళ్యాణ్ ‘సర్దార్’ ఫస్ట్ లుక్ ఇదే... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘సర్దార్' పస్ట్ లుక్ విడుదలైంది. నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తొలిషెడ్యూల్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైనా పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో పాల్గొనలేదు.

సెకండ్ షెడ్యూల్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొంటారని చెప్పినా, అదీ ఆలస్యం అవుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రెండు రోజుల క్రితం (జులై 29) హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో జాయిన్ అయ్యారు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి. గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ గా ఈచిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఇక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నీ సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

English summary
Powerstar Pawan Kalyan has joined the sets of Sardar movie recently. The official first look of Sardar was released short while ago. Producer of Sardar movie, Sarath Marrar tweeted the first look.
Please Wait while comments are loading...