»   » మధుర శ్రీధర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్

మధుర శ్రీధర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ సినిమాలతో దర్శకుడిగా సుపరిచితుడైన శ్రీధర్ రెడ్డి తాజాగా 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా మహత్‌ని ఎంపిక చేసుకున్నారు. ఆ మధ్య చెన్నయ్‌లో మంచు మనోజ్ తో ఘర్షణకు దిగాడంటూ ప్రచారంలోకి వచ్చిన తమిళ కుర్ర హీరో మహత్ రాఘవేంద్ర ఈ సినిమాతో తెలుగులో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మీడియాకు విడుదల చేసారు.

  ఆ మధ్యన తాప్సీ విషయమై మంచు మనోజ్ తో గొడవలు పడి పోలీస్ స్టేషన్ లో కేసులు అవీ పెట్టిన తమిళ హీరోనే. ఆ తర్వాత తాప్సీ వాళ్లు గొడవ పడింది నా గురించి కాదనీ వివరణ ఇచ్చింది. అయితే తమిళ మీడియా మాత్రం మహత్ ని ఇప్పటికీ తాప్సీ బోయ్ ప్రెండ్ గానే అభివర్ణిస్తోంది.

  తాజాగా మహన్ ని తెలుగు దర్శకుడు మధురా శ్రీధర్ తన సినిమాలో హీరోగా తీసుకోవటంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు బయిటకు వస్తే మరెన్ని తెలుగు సినిమా ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నారు.

  ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కాలేజ్,లవ్ ఫెయిల్యూర్, బ్రేక్ అప్ వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. పియా బాజిపేయ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అర్చన కవి మరో హీరోయిన్ గా తీసుకున్నారు. ఎమ్.వి.కె రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నరు. సునీల్ కాశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Madhura Sridhar who made films like Sneha Geetam and Its My Love Story is now directing a new youthful entertainer. Titled Back Bench Student, the film has Mahat Raghavendra and Piaa Bajpai and Archana Kavi in the lead roles. The lead hero Mahat Raghavendra was in the news recently for his alleged brawl with Manchu Manoj.
 
 As the title suggests, the film is about a college student and his love story. The first look poster conveys the message that this is not regular love story but a breakup love story.
 
 The film is currently being shot in Hyderabad and is expected to hit the screens early next year. Produced by M V K Reddy, the movie has music by Sunil Kashyap.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more