»   » ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ నాని హీరోయిన్ ఈవిడే (ఫస్ట్ లుక్)

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ నాని హీరోయిన్ ఈవిడే (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘నమో వెంకటేశ', ‘దూకుడు', ‘1 నేనొక్కడినే', ‘లెజెండ్', ‘పవర్'(కన్నడం), ‘ఆగడు', వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ'.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. తాజాగా హీరోయిన్ మెహరీన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో మెహరీన్ మహాలక్ష్మిగా కనిపించబోతోంది.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్, థీమాటిక్ టీజర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భలే భలే మగాడివోయ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రమిది. అందాల రాక్షసి వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది.

First Look of Nani's Mahalakshmi in KVPG

రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మాతలు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 20న నిర్వహిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా ఫిభ్రవరి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.ః

English summary
Here is the first look poster of Mehreen who is all set to make a debut in Telugu alongside hero Nani in much awaited Krishna Gadi Veera Prema Gadha. Billed to be a romantic story between Krishna (Nani) and Mahalakshmi (Mehreen), the movie is in the final leg of production.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu