»   » పోస్టర్...యాజటీజ్ దింపేసారు(ఫొటో)

పోస్టర్...యాజటీజ్ దింపేసారు(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్ : రీమేక్ అంటే మరీ పోస్టర్స్ దగ్గరనుంచీ ఇమిటేట్ చేసి యాజటీజ్ దింపేయాలా అంటున్నారు సినీ జనం. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై సచిన్ (వౌనమేలనోయి ఫేం) హీరోగా కె.రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ రూపొందిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలైంది. హిందీలో విజయవంతమైన 'ఆషికీ-2' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సైతం 'ఆషికీ-2' ని కద్దిగా కూడా మార్చకుండా దింపేయటం...సృజనాత్మకత దివాళా అంటున్నారు. ఈ సినిమా ద్వారా సంజయ్‌దత్ మేనకోడలు నజియా హీరోయిన్ గా పరిచయమవుతోంది.

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- దబాంగ్ చిత్రం తీసుకొని గబ్బర్‌సింగ్‌గా తాను రీమేక్ చేశానని, ఇప్పుడు ఆషికి-2 చిత్రాన్ని తెలుగులో తన మిత్రుడు సచిన్ కధానాయకుడిగా రూపొందిస్తున్నాడని, తన వ్యాపారాలతో బిజీగా ఉన్నా సచిన్ ఈ చిత్రంలో తనకోసం నటిస్తున్నాడని, ఆషికి కథను ఏ మాత్రం మార్చకుండా క్లైమాక్స్‌లో చిన్న చిన్న మార్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సంగీతం కూడా అదే బాణాలతో ఉంటుందని సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

  First look of 'Nee Jathaga Nenundali', the Telugu remake of 'Aashiqui 2'

  దాదాపు 8 సంవత్సరా తరువాత తెలుగులో తన స్నేహితుడైన బండ్ల గణేష్ ద్వారా రీ ఎంట్రీ అవుతున్నందుకు ఆనందంగా ఉందని కధానాయకుడు సచిన్ తెలిపారు. తనకు నచ్చిన ఆషికి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ఆ చిత్రాన్ని చూసినప్పుడే తెలుగులో రీమేక్ చేస్తే బావుంటుందని అనుకున్నానని, అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలని దర్శకుడు కె.రవీంద్ర తెలిపారు.

  మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన ఈ హిందీ చిత్రంలో ఆదిత్యా కపూర్,శ్రద్దా కపూర్ లీడ్ పెయిర్ గా చేసారు. తెలుగు వెర్షన్ కు గానూ సచిన్‌ జోషి(నిను చూడక నేనుండలేను,ఒరేయ్ పండు,మిత్రుడు) హీరో గా ఎంపిక చేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జయ రవీంద్ర అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నీ జతగా నేనుండాలి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ రామ్ చరణ్ హిట్ చిత్రం ఎవడు లో సూపర్ హిట్ సాంగ్ లోంచి తీసుకున్నారు.

  ఇక దర్శకుడు జయ రవింద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అయ్యింది. వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అంతటా వినిపిస్తోంది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరిస్తున్నాడని అంటున్నారు.


  రావూ రమేష్, శశాంక్, కాశీ విశ్వనాధ్, పృధ్వీ, రవివర్మ, అనితా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:మధుసూదన్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, కెమెరా:ఎ.వసంత్, సంగీతం: అంకిత్ తివారి, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: కె.రవీంద్ర.

  English summary
  The makers of the Telugu remake of Bollywood blockbuster 'Aashiqui 2' have released the first look poster of the film. Titled ‘Nee Jathaga Nenundali’, the romantic film stars Sachiin Joshi and Sanjay Dutt's niece Nazia Hussain in the lead roles. Jaya Ravindra has directed the film while Bandla Ganesh is producing it. 'Nee Jathaga Nenundali' is most likely to release this year. Here's the first-look poster of the remake.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more