»   » అల్లు శిరీష్ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్..!

అల్లు శిరీష్ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు శిరీష్, పరుశరామ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ ఉదయం ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమాకు ‘శ్రీరస్తు శుభమస్తు' అన్న టైటిల్‌ను ఖరారు చేయటంతో అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. అచ్చ తెలుగు టైటిల్ కావటంతో మాస్, క్లాస్ తేడా లేకుండా అందరికీ నచ్చుతుందని అంటున్నారు. అల్లు శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ఇక అల్లు శిరీష్ ...‘గౌరవం' సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట' సినిమా చేసాడు. అదీ పెద్దగా నిలబడలేదు. దాంతో ఆయన గ్యాప్ తీసుకుని ఈ మూడో సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

ఇక దర్శకుడుగా పరుశరామ్...‘యువత', ‘ఆంజనేయులు', ‘సోలో' సినిమాలతో మెప్పించారు. రవితేజ తో చేసిన ‘సారొచ్చారు' ఫ్లాప్ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. రకరకాల హీరోల చుట్టూ తిరిగి కథలు వినిపించారు. కానీ ఏదీ చివరి వరకూ వెళ్లలేదు. ఈ నేపధ్యంలో అల్లు శిరీష్ తో చేస్తున్న ఈ చిత్రంతో ఆయన మళ్ళీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నారు.

English summary
Allu Sirish just released first look poster of his upcoming film. It has been titled Srirastu Subhamastu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu