Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పూనమ్ పాండే వెరీ హాట్ మాలిని ఫస్ట్‌లుక్ (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ సంచలనం పూనమ్ పాండే త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రస్తుతం ‘మాలిని అండ్ కో' అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. వీరు.కె దర్శకుడు. మనీషా ఫిలింస్ పతాకంపై కిషోర్‌రాఠి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలను పూనమ్ పాండే తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా విడుదల చేసింది. ఆ మధ్య ఈ సినిమాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూన్ పాండే మాట్లాడారు. ‘మాలిని అండ్ కో' చిత్రంలో అభినయానికి ప్రాధాన్యతవున్న పాత్రలో నటించాను. నటిగా నాకు మంచి గుర్తింపుతెచ్చే చిత్రమిది. ఈ తరహా పాత్రలు మరిన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పింది పూనమ్‌పాండే.
సినిమాకు సంబంధించని వివరాలు, పూనమ్ పాండే ఫోటోలు స్లైడ్ షోలో....

మాలిని
మాలిని చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

ఫస్ట్ లుక్
పూనమ్ పాండే తన తాజా సినిమా ‘మాలిని అండ్ కో' ఫోటోలను విడుదల చేసింది

కథేంటి?
టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రమిది. రెండు అంశాలను మేళవించి వినోదాత్మకంగా తెరకెక్కించామని యూనిట్ సభ్యులు తెలిపారు.

పూనమ్ పాండే
ఈ చిత్రంలో పూనమ్‌పాండే పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి. ఆమె అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకోనుందని తెలిపారు.

భిన్నంగా ఉంటుందట..
ఈ చిత్రం రొటీన్‌కి రొటీన్‌కు భిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

20 రోజుల్లో షూటింగ్...
ముంబై, కేరళతో పాటు హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 20రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరణ జరిపి షూటింగ్ పూర్తిచేసినట్లు తెలిపారు.

ముఖ్యపాత్రల్లో...
ఈ చిత్రంలో పూనమ్ పాండేతో పాటు సామ్రాట్, మిలన్, ఖుషీ, ఫరా, కావ్యాసింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: మరుధూరి రాజా.