»   » ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది! అదిరింది

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది! అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అభిమానులు ఎదురుచూస్తున్న 'గౌతమిపుత్ర..' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. బాలయ్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా బావించి చేస్తున్న ఈ వందో చిత్రం చారిత్రికం కావటంతో అందరి దృష్టీ దానిపైనే ఉంది. క్రిష్ ఈ విషయాన్ని అర్దం చేసుకుని అత్యంత జాగ్రత్తగా ప్రతీ విషయం అద్బుతంగా ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

శుక్రవారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ 'గౌతమిపుత్ర...' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చాలా బాగుందంటూ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.


First look poster: Gauthamiputra Satakarni

ఇందులో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆయన సరసన శ్రియను చిత్ర బృందం ఇటీవలే ఎంపిక చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పోస్టర్‌పై హ్యాపీబర్త్‌డే 'బసవతారకరామపుత్ర బాలకృష్ణ' అంటూ యూనిట్‌ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.


ఈ పుట్టిన రోజుతో బాలయ్య 56వ ఏట అడుగెడుతున్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పకుడు.


ఇటీవల మొరాకోలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాల్లోని స్టిల్‌నే ఫస్ట్‌లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు. ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్ గా ఎంపికైన శ్రేయ కూడా పాల్గోనుంది.

English summary
Here is the first look poster of Nandamuri Balakrishna's 100th movie 'Gauthamiputra Satakarni'. On the occasion of Balakrishna's birthday (June 10th), the poster was unveiled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu