twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ లుక్: 'శైవం' రీమేక్ లో రాజేంద్రప్రసాద్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ..తమిళ రీమేక్ 'శైవం' తో త్వరలో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. దాగుడు మూతల దండాకోర్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. క్రిష్ వద్ద పని చేసిన ఆర్కే మలినేని ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. తమిళంలో ఈ పాత్రను నాజర్ చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆ నలుగురు చిత్రంతో మళ్లీ పామ్ లోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత మీ శ్రేయాభిలాషి మినహా చెప్పుకోతగ్గ పాత్ర చేయలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా జులాయి, మొగుడు వంటి చిత్రాల్లో చేసినా ఆయన ఇండిడ్యువల్ గా చేసి మెప్పించే పాత్ర పడలేదు. ఇప్పుడు ఓ తమిళ రీమేక్ లో ఆయనకు అలాంటి పాత్ర దొరికిందని తెలుస్తోంది.

    First Look: Rajendra Prasad in Saivam remake!

    ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో సిద్దార్ద్ వర్మ కనిపించనున్నాడు. 3జీ లవ్‌' చిత్రం ద్వారా హీరోగా పరిచ యమైన భీమవరం హీరో సిద్ధార్థ్‌ వర్మ. ప్రస్తుతం 'దాగుడు మూతల దండాకోర్‌', 'కోడిపుంజు'తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. నేడు ఈ యువ నటుడి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో మాట్లాడుతూ, 'సినిమాలంటే చిన్ననాటి నుంచి ఫ్యాషన్‌. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమకు వచ్చాను. త్రీజీ లవ్‌ సినిమాతో హీరోగా పరిచయమైన తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

    నటనపై ఎక్కడా శిక్షణా కూడా తీసుకోలేదు. నిర్మాత డి.ఎస్‌ రావుగారు చాలా విషయాలు నేర్పించారు. పరిశ్రమలో త్రీజీ లవ్‌ నిర్మాత ప్రతాప్‌ గాడ్‌పాధర్‌ అయితే..డి.ఎస్‌ రావును గురువుగా భావిస్తాను. కెరీర్‌ ఆరంభంలోనే అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రస్తుతం నటిస్తోన్న 'దాగుడుమూతల దండాకోర్‌'లో రాజేంద్రప్రసాద్‌ గారితో కలిసి నటిస్తుండటం గొప్ప అనుభూతినిస్తుంది.

    ఈ చిత్రాన్ని రెండు పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. అందువల్ల చాలా మంది అభ్యర్ధులు ఆడిషన్స్‌కు వచ్చారు. ఫైనెల్‌గా నన్ను ఎంపిక చేసుకున్నారు. 'కోడి పుంజు'లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నా. దర్శకురాలు బి.జయగారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాను.

    క్యారెక్ట్‌ర్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరో వరకూ అందరినీ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నా. మరిన్ని మంచి సినిమాల్లో నటించి విమర్శకులు ప్రశంలందుకు కోవాలి' అన్నారు.

    వివరాల్లోకి వెళితే..

    తెలుగులో ఉన్న ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్ లో ఒకటైన ఉషాకిరణ్ మూవిస్ దర్శకుడు క్రిష్ కలిసి నిర్మాతగా ఓ చితం నిర్మిస్తున్నారు. రామోజీరావు గారు నిర్మించే ఈ చిత్రం ఓ తమిళ రీమేక్ అని సమాచారం. తమిళంలో నాన్న డైరక్టర్ విజయ్ రూపొందించిన ‘శైవం'కి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం చూసిన క్రిష్...బాగా నచ్చి రామోజీరావు గారికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. రామోజీరావు గారు సైతం ఈ చిత్రం చూసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ విషయమై వారు నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారా లేదా అన్నది తెలియదు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు రాజేంద్రప్రసాద్ ని తీసుకున్నారు

    'నాన్న‌' చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో 'తలైవా' ఫేం ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైవం'. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. విజయ్‌ కూడా మంచి విజయం దక్కిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఆమెనే తీసుకునే అవకాసం ఉంది. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసారు.

    ఇందులో 'దైవతిరుమగల్‌' ఫేం బేబీ సారా నటించటం ప్లస్ అయ్యింది. నాజర్‌ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్‌ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.

    క్రిష్ విషయానికి వస్తే...

    గతంలో క్రిష్...కంటెంట్ నే నమ్ముకుని గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం చిత్రాలు చేసారు. ప్రస్తుతం తమిళ రీమేక్ గబ్బర్ లో బిజీగా ఉన్నారు. గబ్బర్ చిత్రం తమిళ చిత్రం రమణ కు రీమేక్. రమణ చిత్రం తెలుగులో ఠాగూర్ గా వచ్చి హిట్టైంది. అక్షయకుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

    English summary
    Here is the first look of 'Daagudumoota Dandakor' in which Rajendra Prasad plays the role of grandfather and Sara Arjun (Nanna fame) appears as his grand-daughter. The film is about the relationship between a child and rooster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X