»   » రజనీ 'లింగా' ఫస్ట్ లుక్(ఫొటో)

రజనీ 'లింగా' ఫస్ట్ లుక్(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రానికి 'లింగా' అని పేరుపెట్టి రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఆనంద వికటన్ పత్రిక విడుదల చేసింది. ఆ పత్రిక తమ కవర్ పేజీపై ఈ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసి వదిలింది. ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ తమిళనాట అంతటా సంచలనం సృష్టిస్తోంది.

లింగా సినిమా చిత్రీకరణ ఇక్కడికి సమీపంలోని మేలుకోటెలో కొనసాగుతోంది. గ్రామీణ యువతి పాత్రను సోనాక్షి సిన్హా నటిస్తోంది. చిత్రీకరణ లొకేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే పోలీసు కాపలాను ఏర్పాటు చేశారు. లొకేషన్‌ పరిసరాల్లోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. రజనీకాంత్‌ను చూడాలనే ఆశతో పరిసర గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్థులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. లొకేషన్‌కు కారులో వెళ్తున్న రజనీకాంత్‌ను దూరం నుంచి చూసి తృప్తిపడాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు మేలుకోటెలో చిత్రీకరణను కొనసాగిస్తారని తెలిసింది.

First Look: Rajinikanth in Lingaa!

పోలీస్ కాపలాకి కారణం వివాదం... కావేరి నదీ జలాల వివాదంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్‌కు రాష్ట్రంలో చిత్రీకరణలో పాల్గొనే నైతికత ఎక్కడుందని కన్నడ సంఘాల కార్యకర్తలు ప్రశ్నించారు. ఇక్కడికి సమీపంలోని ఐజూరు గ్రామంలో కస్తూరి కన్నడ సంఘం కార్యకర్తలు రజనీకాంత్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత ఏడాది కావేరి వివాదం సందర్భంలో రజనీకాంత్‌ తమిళనాడుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే ఈ ఆక్రోశానికి కారణం.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

English summary

 Check out the first look paint poster of Superstar Rajinikanth from his upcoming flick 'Lingaa' which has gone on to floors recently. The unit is currently shooting in Mysore and he next schedule will begin in Hyderabad. KS Ravikumar handles the direction and Rockline Venkatesh produces this biggie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu